- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నకిలీ మావోయిస్టులు అరెస్టు.. ఎక్కడంటే!
దిశ, వేములవాడ: భూక్యారెడ్డి తండా అటవీ ప్రాంతంలో ఎర్ర జెండాలు పాతిన నకిలీ మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 18న సీపీఐ జెండాలను చెట్లకు కట్టి, లెటర్లను వదిలేసిన ఘటనకు బాధ్యులైన వారిపై కేసు నమోదైంది. మంగళవారం సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డె కథనం ప్రకారం.. కోనరావుపేట మండలం భూక్యారెడ్డి తండాకు చెందిన లకావత్ సతీష్, చందుర్తి మండలం సనుగుల గ్రామానికి చెందిన జటావత్ ప్రశాంత్ కలిసి నిమ్మపెళ్లి నుండి మరిమడ్ల వెళ్లే రహదారిని ఆనుకుని ఉన్న దాదాపు 45 ఎకరాల అటవీ భూమిలో సీపీఐ ఎర్ర జెండాలను నీలగిరి చెట్లకు కట్టారు.
అలాగే, తండాలో సీపీఐ పార్టీ పేరిట లెటర్లను గ్రామంలోని ప్రతీ ఇంటి ముందు వేశారు. ఈ విషయం ఈనెల 18న బయటకు రావడంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని జెండాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా జెండాల ముద్రణ, స్టాంపుల తయారీ, గూగుల్ పే ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలపై నిఘా పెట్టగా.. నకిలీ మావోయిస్టుల పనిగా తేలింది. దీని ఆధారంగా సిరిసిల్లలో తలదాచుకున్న సతీష్, ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుండి బ్యానర్లు, రబ్బరు స్టాంప్, రెండు మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను ఎస్పీ అభినందించారు.