దుల్కర్‌ సినిమాలో మాలీవుడ్ సూపర్ స్టార్స్.. ?

by Shyam |   ( Updated:2021-09-24 01:32:28.0  )
దుల్కర్‌ సినిమాలో మాలీవుడ్ సూపర్ స్టార్స్.. ?
X

దిశ, సినిమా : పాన్ ఇండియా స్టార్ దుల్కర్ సల్మాన్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ ‘కురుప్’. దుల్కర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్న సినిమాలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు మరికొందరు సెలబ్రిటీలు కూడా నటిస్తున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో ఆ నోట ఈ నోట ఈ వార్త విన్న దుల్కర్‌ స్పందిస్తూ.. “ఇలాంటి ఫేక్ న్యూస్‌ స్ప్రెడ్ చేస్తున్న వారిపై కఠినచర్యలు తీసుకోవాలన్నారు. మూవీ రిలీజ్‌కు ముందు ఇంతటి హైప్ క్రియేట్ చేస్తే ఆడియన్స్ డిజప్పాయింట్ అవుతారని, సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నామని, రైట్ టైమ్‌లో కచ్చితంగా మీ ముందుకు వచ్చి ఎంటర్‌టైన్ చేస్తుందని వివరించాడు. కానీ ఇలాంటి తప్పుడు ప్రచారం స్ప్రెడ్ చేయడం వల్ల సినిమాకు నష్టం జరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed