మతిస్థిమితంలేని మహిళపై అత్యాచారయత్నం.. ఆపై బీరు సీసాలతో

by srinivas |   ( Updated:2021-07-16 05:07:23.0  )
andrapradesh news
X

దిశ, ఏపీ బ్యూరో: మతిస్థిమితం లేని మహిళను చూస్తే జాలేస్తోంది. ఆమె పరిస్థితిని చూసి అయ్యో పాపం అని బాధపడతాం. కానీ, వారిని కూడా కామాంధులు వదలడం లేదు. మంచి, మానవత్వం మరిచి వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా బస్ షెల్టర్‌లో తలదాచుకుంటున్న మతిస్థిమితం లేని మహిళపై కొందరు కామాంధులు రెచ్చపోయారు. ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. ఆమె కేకలు వేయడంతో బీర్ సీసాలతో ఆమెను కొట్టి పరారయ్యారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం పెనుబాకలో జరిగింది.

వివరాల్లోకి వెళితే .. మతిస్థిమితం లేని ఓ మహిళ పెనుబాక గ్రామంలో తిరుగుతుంది. ఆమె బస్ షెల్టర్ ‌లో తలదాచుకుంటుంది. గురువారం అర్థరాత్రి కొందరు యువకులు మద్యంమత్తులో బస్ షెల్టర్ దగ్గరకు వచ్చారు. బస్ షెల్టర్‌లో తలదాచుకుంటున్న ఆమెపై అత్యాచారయత్నం చేశారు. దీంతో ఆ మహిళ గట్టిగా అరవడంతో కామాంధులు వారు వెంట తెచ్చుకున్న బీరు సీసాలతో ఆమెపై దాడి చేశారు. అనంతరం అక్కడ నుంచి పరారయ్యారు. అయితే బాధితురాలకి తీవ్ర గాయాలవ్వడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

Next Story