- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డ్రగ్స్ సప్లై జోర్దార్
దిశ, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గంజాయి రవాణా జోరుగా సాగుతోంది. ఇటీవల పోలీస్ శాఖ అధికారుల వరుసదాడులతో గంజాయి రవాణా ముఠాలను అరెస్టు చేస్తున్నారు. పదుల సంఖ్యలో గంజాయి రవాణా ముఠాలు ఉన్నట్టు జిల్లా పోలీస్ యంత్రాంగం గుర్తించినట్టు సమాచారం. జిల్లాలో ప్రధానంగా భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు, చర్ల, అశ్వరావుపేట, తిరుమలాయపురం, ఖమ్మం శివారు ప్రాంతాల మీదుగా ఈ రవాణా సాగుతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా సమాచారం అందింది. ఈ క్రమంలోనే నెలరోజులుగా గంజాయి అక్రమ రవాణాపై పోలీస్‌శాఖ ప్రత్యేక దృష్టి పెట్టి వరుసగా దాడులు నిర్వహిస్తోంది.
పోలీసుల నిఘా..
పదిరోజుల కిందట భద్రాచలం బస్టాండ్ సమీపంలో పరుపుల మధ్యలో గంజాయి ప్యాకెట్లను హైదరాబాద్‌కు తరలిస్తున్న ఆరుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. నిందితుల్లో ఇద్దరు స్థానికులు కూడా ఉన్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. మిగతా ఆరుగురిలో నలుగురు ఒడిషా రాష్ట్రానికి చెందినవారు. ఆ మరుసటి రోజే ఖమ్మం శివారు ప్రాంతం గుండా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు పంపారు. అంతకు ముందు చర్ల కేంద్రంగా గంజాయి రవాణా సాగిస్తున్న వ్యక్తులను గుర్తించారు. అయితే, వారు పరారీలో ఉన్నారు. వారు వదలి వెళ్లిన సరుకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
భారీ నెట్‌వర్క్..
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా అరకు, దాని సమీప ప్రాంతాల్లో పండించిన గంజాయిని మహారాష్ట్రలోని ముంబై, ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్‌కు, తెలంగాణలోని వరంగల్, హైదరాబాద్, కరీంనగర్ పట్టణాలతోపాటు గోదావరిఖని, మంచిర్యాల లాంటి సింగరేణి గనులున్న ప్రాంతాలకు చేరవేస్తున్నారు. మొదలు ఏపీ నుంచి ఖమ్మం జిల్లాకు చేర్చి అక్కడ్నుంచి ఆయా ప్రాంతాలకు రైలు, రోడ్డు రవాణా మార్గాల ద్వారా గమ్యాలకు చేరుస్తున్నారు. ఇందుకు కొంతమంది స్థానిక గిరిజన యువకులకు డబ్బు ఆశ చూపి వారి సాయం పొందుతున్నారు. వాస్తవానికి ఈ దందాలో సాగు మొదలు విక్రయం వరకు చాలా పెద్ద నెట్‌వర్కే పనిస్తోందని సమాచారం. సరుకు ఎగుమతి..దిగుమతి..గమ్యాస్థానాలకు చేర్చడం ఇలా ఒక్కో పనిని ఒక్కో ముఠాసభ్యులు పనిచేస్తుంటారు. ఒకరితో ఒకరికి సంబంధాలుండవు. సమాచారం పంచుకునే అవకాశం ఉండదు. వీరందరినీ ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేస్తూ వారికి అవసరమైన సమాచారాన్ని చేరేవేసేందుకు ముఠా లీడర్లు ఒకరిని నియమించుకుంటారు. పోలీసులకు చిక్కిన అసలు విషయం ఎక్కడా బయటకు రాకుండా ఉండేందుకే స్మగ్లర్లు ఈ ఎత్తుగడను ఫాలొవుతారని పోలీసులు వెల్లడిస్తున్నారు. గంజాయి విక్రయాలు జిల్లాలో చాపకింద నీరులా సాగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా యువత గంజాయి మత్తులో తేలియాడుతోంది. సిగరెట్లలో పొగాకు తీసేసి..గంజాయి నింపుకుని తాగుతున్నట్టు తెలుస్తోంది.
పోలీసుల కండ్లు గప్పి..
విశ్వసనీయ సమాచారం ప్రకారం అరకు నుంచి భద్రాచలం, కొత్తగూడెం వరకు రోడ్డు మార్గం ద్వారా తీసుకువస్తున్న స్మగ్లర్లు అక్కడి నుంచి ప్యాసింజర్ రైళ్లలో అటు మహారాష్ట్ర వైపునకు ఇటు హైదరాబాద్ వైపునకు తీసుకెళ్తున్నట్లుగా తెలుస్తోంది. గంజాయి మూటలను బోగిలో వేశాకా.. బోగీ నెంబర్ వివరాలను ముఠాపెద్దకు చెబుతారు. ముఠా పెద్ద దిగుమతి చేయాల్సిన స్టేషన్ పేరును ప్రాంతాన్ని సూచిస్తాడు. ఆ ప్రకారం రన్నింగ్‌లో ఉన్న రైలు నుంచి గంజాయి బస్తాలను రైలు ట్రాక్‌ల పక్కన విసిరేస్తారు. అప్పటికే సిద్ధంగా ఉన్న కొంతమంది సరుకును అక్కడి నుంచి మరో చోటుకు తరలిస్తారు. ఇదంతా పక్కా ప్రణాళికతో జరుగుతోంది.
Tags: drugs supply, huge network, khammam