- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వైరస్‌లా నటించి…కేన్సర్ కణాలకు చెక్..
దిశ, వెబ్‌డెస్క్: శరీరంలో కణాల అనియంత్రిత వృద్ధిని కేన్సర్‌గా పేర్కొంటారు. శరీరంలో ఉన్న వ్యాధినిరోధక వ్యవస్థ కంటపడకుండా ఈ కేన్సర్ కణాలు దాక్కోగలుగుతాయి. అందుకే అవి ఎక్కడ ఉన్నాయో తెలియక వ్యాధినిరోధక వ్యవస్థ సరిగా పనిచేసే అవకాశం దొరకదు. నిజానికి శరీరంలో ఏదైనా వైరస్ ప్రవేశించినపుడు ఆ వైరస్‌లో ఉండే డబుల్ స్ట్రాండెడ్ ఆర్‌ఎన్ఏ అణువుల కారణంగా దాని స్థానం గురించి వ్యాధినిరోధక వ్యవస్థకు తెలుస్తుంది. స్థానం గురించి తెలియగానే అక్కడికి తెల్లరక్తకణాలు వెళ్లి వైరస్‌ను నాశనం చేస్తాయి. ఇలా వ్యాధినిరోధక వ్యవస్థ పనిచేస్తుంది. ఈ పనితీరు మెకానిజాన్ని దృష్టిలో పెట్టుకుని శాస్త్రవేత్తలు కేన్సర్ కణాలకు చెక్ పెట్టే దారిని కనుక్కున్నారు.
యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలోని రేడియోషన్ ఆంకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అనుషా కల్బాసీ బృందం ఒక మందును కనిపెట్టారు. ఆ మందు పేరు బీవో-112. పైన చెప్పిన వ్యాధినిరోధక వ్యవస్థ మెకానిజం ఆధారంగా ఈ మందు పనిచేస్తుంది. నేరుగా కేన్సర్ కణాల్లోకి ఎక్కించే ఈ మందులో వైరస్‌లలో ఉండే డబుల్ స్ట్రాండెడ్ ఆర్‌ఎన్ఏ లాంటి జన్యుపదార్థం ఉంటుంది. దీంతో కేన్సర్ కణాలలో దీన్ని ఎక్కించగానే శరీర వ్యాధినిరోధక వ్యవస్థ ఏదో వైరస్ వచ్చిందనుకొని భ్రమ పడుతుంది. దీంతో తెల్లరక్త కణాలను మందు ఎక్కించిన చోటికి పంపిస్తుంది. ఆ స్థానంలో మందుతోపాటు ఉన్న కేన్సర్ కణాలను కూడా నాశనమవుతాయని అనుషా కల్బాసీ తెలిపారు. శరీర వ్యాధినిరోధక వ్యవస్థ కంటపడకుండా దాక్కున్న కేన్సర్ కణాల జాడను ఈ మందు ద్వారా బట్టబయలు చేయొచ్చని, దీన్ని ట్రయల్స్ వేసినపుడు మంచి ఫలితాలు కూడా వచ్చాయని ఆమె చెప్పారు.