- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అడిగేవారు లేరని.. హనుమాన్ టెంపుల్‌లో మందు, మాంసం..!
దిశ, వెబ్‌డెస్క్: హనుమాన్ టెంపుల్‌లో మందు, మాంసం కలకలం రేపుతోంది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఆర్సీపురం కాచిరెడ్డిపల్లి హనుమాన్ టెంపుల్‌లో మందుబాబులు రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి అయితే చాలు గుడి ఆవరణలో అడ్డా పెడుతున్నారు. ఇదే గుడిలో పోచమ్మ, నాగులమ్మ అమ్మవార్ల ఆలయాలు కూడా ఉన్నాయి. సాధారణంగా బోనాల జాతర సందర్భంగా ఇక్కడ జంతు బలి ఉంటుంది. అయినప్పటికీ ఈ గుడిలో మద్యపానం నిషేధం.
ఇటువంటి పవిత్ర హనుమాన్ ఆలయంలో కొంతమంది ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడటం గమనార్హం. గుడిమెట్ల మీదనే మాంసం ముక్కలు పెట్టుకొని మద్యం సేవించడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఉదయం గుడికెళ్లి చూస్తే.. అంతటా మందు బాటిళ్లు దర్శనమిస్తున్నాయని, మాంసం ఎముకలు ఉంటున్నాయని వాపోతున్నారు. ఆలయంలో ఇటువంటి పాడు పనులు ఏంటని.. స్థానిక కార్పొరేటర్ సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.