డాక్టర్ రెడ్డీస్ ఆదాయం రూ. 4,418 కోట్లు!

by Harish |
డాక్టర్ రెడ్డీస్ ఆదాయం రూ. 4,418 కోట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌కు చెందిన ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నికర లాభం 12.59 శాతం క్షీణించి రూ. 579.30 కోట్లుగా నమోదైనట్టు కంపెనీ వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ. 662.80 కోట్లుగా నమోదైంది. సమీక్షించిన త్రైమాసికంలో మొత్తం ఆదాయం 14.93 శాతం పెరిగి రూ. 4,417.50 కోట్లకు చేరుకుంది. ఆర్థిక ఫలితాలపై స్పందించిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ కో-ఛైర్మన్ జీవీ ప్రసాద్.. తొలి త్రైమాసికంలో ఆర్థిక పనితీరు అన్ని విభాగాల్లోనూ బలంగా ఉంది. కరోనా లాంటి క్లిష్ట వాటావరణంలోనూ సానుకూల పనితీరును కనబరిచామని జీవీ ప్రసాద్ తెలిపారు.

అలాగే, ఫార్మా కంపెనీ వోకార్డ్ నుంచి ఫార్మా బిజినెస్‌ను తమ కంపెనీలో విలీనం చేసే ప్రక్రియను మొదలుపెట్టామని జీవీ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రస్తుత కరోనా చికిత్సకు అవసరమైన రెండు లైసెన్సింగ్ ఒప్పందాలను కుదుర్చుకున్నామని తెలిపారు. త్వరలో పలు మార్కెట్లలో కొవిడ్-19 చికిత్సకు కావాల్సిన ఔషధాలను అందించేందుకు కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే, ఆదాయపు పన్ను చెల్లింపులను గతేడాదితో పోలిస్తే 60 శాతం అధికంగా రూ. 299.60 కోట్లను చెల్లించినట్టు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.

Advertisement

Next Story