డాక్టర్ రెడ్డీస్ నుంచి కొవిడ్-19 మందు

by Harish |
డాక్టర్ రెడ్డీస్ నుంచి కొవిడ్-19 మందు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీస్ లిమిటెడ్(Dr. Reddy’s Laboratories Ltd.) బుధవారం భారత్‌లో ‘రెడిక్స్’ (Redix) బ్రాండ్ పేరుతో కొవిడ్-19 డ్రగ్ రెమ్‌డెసివిర్‌ (Covid-19 Drug Remindesivir)ను విడుదల చేసింది. గిలియడ్ సైన్సెస్‌తో జరిగిన ఒప్పందంలో భాగంగా డాక్టర్ రెడ్డీస్ ఈ ఔషధాన్ని భారత్‌తో పాటు 127 దేశాలకు తయారుచేసి విక్రయించనుంది. తీవ్రమైన లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన కొవిడ్-19 రోగుల అత్యవసర చికిత్స కోసం ఈ ఔషధం వినియోగించడానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCIG) ఆమోదించింది.

రెడిక్స్ ఔషధం 100 మి. గ్రా. మోతాదులో లభిస్తుంది. ‘భవిష్యత్తులో రోగులకు అవసరమైన ఉత్పత్తులను అభివృద్ధి చేసేందుకు తాము ప్రయత్నాలను కొనసాగిస్తామని, భారత్‌లో కొవిడ్-19తో బాధపడుతున్న రోగులకు కావాల్సిన ఔషధం తీసుకురావడానికి నిబద్ధత కలిగి ఉన్నామని ‘డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎంవి రమణ చెప్పారు. గతనెలలో డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీస్ భారత్‌లో అవిగాన్ బ్రాండ్ పేరుతో ఫావిపిరవిర్ 200 మి.గ్రా ట్యాబ్లెట్లను విడుదల చేసింది. స్వల్ప,తేలికపాటి లక్షణాలున్న వారికి చికిత్స కోసం అవిగాన్ ఆమోదించబడింది. డాక్టర్ రెడ్డీస్ ప్రస్తుతం దేశంలోని 42 నగరాల్లో ఉచిత ఔషధాన్ని ఉచితంగా హోమ్ డెలివరీ సేవలందిస్తూనే, హెల్ప్ లైన్ కేంద్రాన్ని ప్రారంభించింది.

Advertisement

Next Story

Most Viewed