డాక్టర్ కఫీల్ ఖాన్‌పై ‘ఎన్ఎస్ఏ’

by Shamantha N |
డాక్టర్ కఫీల్ ఖాన్‌పై ‘ఎన్ఎస్ఏ’
X

ఉత్తరప్రదేశ్‌కు చెందిన డాక్టర్ కఫీల్ ఖాన్‌పై ప్రజా భద్రత చట్టం(ఎన్ఎస్ఏ) ప్రయోగించారు. 2017లో ప్రభుత్వ ఆస్పత్రిలో 60 మంది చిన్నారులు ఆక్సిజన్ కొరతతో మృతిచెందిన ఘటన తర్వాత అరెస్టయి నిర్దోషిగా బయటపడ్డ డాక్టర్ కఫీల్ ఖాన్ గతేడాది అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ(ఏఎంయూ)లో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై రెచ్చగొట్టేలా ప్రసంగించారని ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత గతనెల ముంబయి ఎయిర్‌పోర్టులో కఫీల్ ఖాన్‌ను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. కాగా, సోమవారం అతనికి బెయిల్ మంజూరైనా.. ఇంకా విడుదల చేయలేదు. తాజాగా కఠినమైన ఎన్ఎస్ఏను ప్రయోగించడంపై యోగేంద్రయాదవ్ లాంటి సామాజిక కార్యకర్తలు విమర్శిస్తున్నారు. ఎన్ఎస్ఏ కింద కోర్టులో చార్జిషీటు దాఖలు చేయకుండానే.. ఏడాదిపాటు నిర్బంధించవచ్చు.

Advertisement

Next Story