- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్రమంత్రి ప్రమాణిక్ జాతీయతపై సందేహాలు
న్యూఢిల్లీ: కేంద్రమంత్రివర్గంలో కొత్తగా చేరిన పశ్చిమ బెంగాల్ ఎంపీ నిశిత్ ప్రమాణిక్ జాతీయతపై సందేహాలు వెలువడుతున్నాయి. ప్రమాణిక్ బంగ్లాదేశీ అంటూ కొన్ని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయని, అదే నిజమైతే ఒక విదేశీ వ్యక్తిని కేంద్రమంత్రిగా కొనసాగడం తీవ్రపరిణామాలకు దారితీయవచ్చని కాంగ్రెస్ ఎంపీ, కాంగ్రెస్ అసోం చీఫ్ రిపున్ బోరా పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై పారదర్శకంగా దర్యాప్తు చేసి నిజాలను దేశ ప్రజలకు తెలియజేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. పార్లమెంటు సమావేశానికి ముందు ఈ ఆరోపణలపై చర్చ తీవ్రమవుతున్నది. తృణమూల్ కాంగ్రెస్ నేతలూ ఈ కథనాలపై స్పందించారు. ‘ఓ న్యూస్ చానెల్ ప్రకారం, నిశిత్ ప్రమాణిక్ బంగ్లాదేశీ.
బంగ్లాదేశ్‌లోని గైబంద జిల్లా హరినాథ్‌పుర్‌లో ప్రమాణిక్ జన్మించారు. కంప్యూటర్ స్టడీ కోసం పశ్చిమ బెంగాల్ వచ్చారు. డిగ్రీ పట్టా వచ్చాక తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. తర్వాత బీజేపీలో చేరి కూచ్‌బెహార్ నుంచి ఎంపీగా గెలిచారు. అనంతరం కేంద్ర హోం శాఖ సహాయమంత్రిగా ఎంపికయ్యారు’ అని రిపున్ బోరా పేర్కొ్న్నారు. ‘ఈ కథనాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని, అవే నిజమైతే దేశభద్రతకు ముప్పు వాటిల్లే అవకాశముందని బెంగాల్ స్టేట్ మినిస్టర్లు తెలిపారు. కేంద్రమంత్రిగా ఎంపికచేసేముందు ఆయన బ్యాక్‌గ్రౌండ్ డీటెయిల్ చెక్ చేయలేదా? భద్రతాపరమైన అంశాల్లో ఇలాంటి లోటుపాట్లను మోడీ ప్రభుత్వం అంగీకరిస్తుందా?’ అని బెంగాల్ మంత్రులు బ్రత్యా బసు, ఇంద్రనిల్ సేన్‌లు పేర్కొన్నారు.