- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిక్షమెత్తుకోను.. ఒక్క పెన్ కొనండి చాలు.. వృద్ధురాలి వైరల్ స్టోరీ
దిశ, ఫీచర్స్ : తరాలు మారేకొద్దీ మనుషుల జీవన విధానాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. జీవనోపాధికి సులువైన మార్గాన్ని ఎంచుకునేందుకే ఇష్టపడుతున్నారు. అయితే జీవిత చరమాంకంలో, వయసు సహకరించని స్థితిలో కూడా ఎవరిపై ఆధారపడకుండా జీవించేవారు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అలాంటి వ్యక్తుల స్టోరీ విన్నప్పుడు నిజంగానే మనసు చెమ్మగిల్లుతుంది. తెలియకుండానే వారిపై గౌరవ మర్యాదలతో పాటు ప్రేమను కురిపిస్తాం. పుణెకు చెందిన ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజర్.. ఇలాంటి స్టోరీనే పోస్ట్ చేయగా నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది.
డైలీ నీడ్స్ కోసం ఎవరిపై డిపెండ్ అవకుండా తన సామర్థ్యానికి మించి పనిచేస్తున్న ఒక వృద్ధ మహిళ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె పేరు రతన్ కాగా.. వ్యాపారవేత్త శిఖా రథి తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఈ విషయాలను పంచుకున్నారు. ‘పుణెలోని MG రోడ్‌లో రతన్ అనే వృద్ధ మహిళ ఒక పెన్నుల పెట్టెను పట్టుకుని విక్రయిస్తూ కనిపించింది. ఇందుకు తన వయసు సహకరించనప్పటికీ జీవనంకోసం అడుక్కునేందుకు ఆమె వ్యతిరేకం. చిత్తశుద్ధి, నిజాయితీతో పనిచేయడం ద్వారా వచ్చిన డబ్బుతోనే జీవితాన్ని గడపాలనేది ఆమె కోరిక. అందుకే రతన్ పెన్నుల పెట్టెపై ‘నాకు అడుక్కోవడం ఇష్టం లేదు. దయచేసి రూ. 10 విలువ గల నీలం రంగు పెన్నులు కొనండి. ధన్యవాదాలు, ఆశీర్వదించండి’ అని రాసిఉన్న నోట్ తన సెల్ఫ్ రెస్పెక్ట్‌ను తెలియజేస్తోంది.
ఇక ఈ పోస్టును షేర్ చేసిన ఇన్‌స్టా యూజర్ శిఖా రథి.. ‘ఈ రోజు నేను నిజ జీవిత హీరో, చాంపియన్- రతన్‌ను కలిశాను! ఆమె పెన్నుల పెట్టెపై నోట్ చదివినప్పుడు నా ఫ్రెండ్ వెంటనే పెన్ కొనుగోలు చేశాడు. ఆమె చాలా సంతోషించింది. అప్పుడు మేము ఆమె కళ్లలో కృతజ్ఞత, దయ చూడగలిగాం! అయితే మాకు కృతజ్ఞతలు చెప్పిన రతన్.. మరిన్ని పెన్నులు కొనాలని మమ్మల్ని అడగలేదు. కానీ ఆమె స్వచ్ఛమైన చిరునవ్వు, దయగల హృదయంతో పాటు చిత్తశుద్ధి మమ్మల్ని మరిన్ని పెన్నులు కొనుగోలు చేసేలా చేసింది!’ అని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఎవరైనా పుణెలోని ఎంజీ రోడ్‌కు దగ్గరగా ఉంటే, రతన్ దగ్గర పెన్నులు కొనండని సూచించారు. ఈ పని మిమ్మల్ని కచ్చితంగా సంతోషపెడుతుందని తెలిపారు.
- Tags
- elderly woman