- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కరోనాపై ఏప్రిల్ ఫూల్ వద్దు
దిశ, వరంగల్: ఏప్రిల్ ఫూల్ చేద్దామని ఎవరైనా కరోనాపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 1 వస్తుందంటే చాలు చాలామంది ఎదుటివారిని సరదాగా ఫూల్స్ చేయడానికి సిద్ధమవుతుంటారని, దానికి ఇది సమయం కాదని వివరించారు. ప్రజలు బాధ్యతతో వ్యవహరించాలని తెలిపారు. టెక్నాలజీ పెరగడంతో ఇది కాస్తా సోషల్ మీడియా దాకా చేరితే శిక్షార్హులు అవుతారని చెప్పారు. కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో తప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Tags: mahabubabad sp,social media,False propaganda,strictly action
Advertisement
Next Story