కరోనా ఎఫెక్ట్.. ఏసీలు వాడకండి

by Shyam |
కరోనా ఎఫెక్ట్.. ఏసీలు వాడకండి
X

దిశ, న్యూస్‌బ్యూరో : చల్లని వాతావరణంలో కరోనా త్వరగా వ్యాపిస్తుందన్న కారణంతో తెలంగాణ పట్టణాభివృద్ధి శాఖ రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లోని అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(యూడీఏ) ఆఫీసుల్లో ఏసీలు బంద్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు శనివారం ఒక అంతర్గత సర్క్యులర్ జారీ చేసింది. ఎండాకాలం వేళ సిబ్బందికి ఉక్కపోతగా ఉంటే గాలి కోసం ఆఫీసు భవనాల కిటికీలు తెరచి ఉంచుకోవాలని సూచించింది. కరోనా భయంతో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాగే ఏసీలు ఆపేస్తే మాంద్యం వేళ ప్రభుత్వ ఖర్చు తగ్గే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Tags: dont, use, AC’s, ts urban development, carona

Next Story

Most Viewed