- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పాఠశాలకు దాతల చేయూత అభినందనీయం
దిశ, మోతె : తాము చదువుకున్న పాఠశాల రుణం తీర్చుకునేందుకు పూర్వ విద్యార్థులు చేస్తున్న కృషి అభినందనీయమని మోతె ఎంఈఓ గోపాల్ రావు అన్నారు. పూర్వ విద్యార్థులే దాతలుగా మారి స్కూల్ అభివృద్ధికి పాటుపడటం నేటి యువతకు స్ఫూర్తిదాయకం అన్నారు. బుధవారం సిరికొండ గ్రామానికి చెందిన నాటి విద్యార్థి అక్కినపల్లి శ్రీశైలం ఎంపీపీఎస్‌కు అందించిన ప్యూరిఫైడ్ మిషన్‌ను ఎంఈఓ ప్రారంభించి మాట్లాడారు.
గ్రామంలోని ప్రతి యువకుడు పాఠశాల అభివృద్ధికి సహకరిస్తే జిల్లా స్థాయిలో ముందు వరసలో ఉంటుందన్నారు. యువకులు తాము చదువుకున్న పాఠశాలకు సేవలను అందించడం అభినందనీయమని అన్నారు. సిరికొండ యువకులు మండల యువతకు ఆదర్శంగా ఉంటున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు లింగనాయక్, మాజీ సర్పంచ్ నూకల శ్రీనివాస్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ మందడి శివరంజని రెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ రజియా బేగం, ఉపాధ్యాయులు లాలూ, విద్యార్థులు పాల్గొన్నారు.