అమెరికా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు మనవాళ్లు!

by Harish |
అమెరికా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు మనవాళ్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టి, పునరుద్ధరణ చేసేందుకు అమెరికా అధ్యక్షుడు సిద్ధమయ్యారు. పలు పరిశ్రమలు, విభాగాలకు చెందిన సుమారు 200 మంది నిపుణులతో బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలలో గూగుల్ సీఈవో సుందర్ పెచయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో పాటు మన దేశ నేపథ్యం కలిగిన ఆరుగురు ఉన్నారు. వీరందరూ అమెరికా ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాలనే అంశంపై ప్రణాళికలను, సలహాలను ఇవ్వనున్నారు. వివిధ రంగాల నుంచి అత్యుత్తమ నైపుణ్యం ఉన్న వారికి ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే బాధ్యతలిచ్చాం. వారందరూ సూచనలు, సలహాలు అందిస్తారని ట్రంప్ మీడియా ప్రకటనలో చెప్పారు.

ట్రంప్ ఎంపిక చేసిన ఈ బృందంలో సుందర్ పిచయ్, సత్య నాదెళ్లతో పాటు మైక్రాన్ సీఈవో సంజయ్, ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ కూడా ఉన్నారు. వీరు సమాచార సాంకేతిక రంగానికి సంబంధించి అవసరమైన సూచనలు ఇవ్వనున్నారు. ఆర్థిక రంగానికి సంబంధించి మాస్టర్ కార్డ్ కంపెనీకి చెందిన అజయ్‌ను, ఉత్పత్తి రంగం పునరుత్తేజానికి ఫెరాడ్ రికార్డ్ బెవరేజ్ సంస్థ సీఈవో ఆన్ ముఖర్జీని ఎంపిక చేశారు. అలాగే వివిధ రంగాల నుంచి కొంతమందిని బృందాలుగా ఎంపిక చేశారు. రక్షణ, కార్మిక, నిర్మాణ, వ్యవసాయ, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, పర్యాటకం, ఆరోగ్యం, ఇంధన, స్థిరాస్తి, సాంకేతిక, క్రీడలు, తయారీ రంగం, రవాణా రంగాల నుంచి ఒక్కో బృందాన్ని ఏర్పాడు చేశారు. అధికార పార్టీల నుంచే కాకుండా అమెరికాలో రెండు ప్రధాన పార్టీలకు చెందిన వారు కూడా ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు గాను ప్రణాళికలను సిద్ధం చేయనున్నారు.

Tags: Donald Trump, Economy, Indians, america economy revival

Advertisement

Next Story

Most Viewed