కరోనా మృతదేహాలను కుక్కలు తింటున్నాయి!

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ మానవుల ప్రాణాలను తీస్తుంటే.. ఆ డెడ్ బాడీలను కుక్కలు తింటున్నాయి. ఇటువంటి దారుణం ఎక్కడో కాదు హైదరాబాద్ మహానగరంలో వెలుగు చూసింది. ఎర్రగడ్డలోని శ్మాశన వాటికలో కరోనా మృతదేహాలను కుక్కలు పీక్కుతింటున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. కరోనా మృతదేహాలు శ్మాశన వాటికకు తీసుకొస్తున్న సిబ్బంది.. అవి పూర్తిగా కాలిపోతున్నాయా లేదా అన్న విషయం పక్కనపెడుతున్నారు. దీంతో చితి మంటలు ఆరిపోయే సరికి చేతులు, తల భాగాలు బయటకు కనిపిస్తున్నాయి. దీంతో శ్మాశన వాటికలో ఉండే కుక్కలు ఆ అవయవాలను పీక్కు తింటున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

Advertisement