- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రైటర్లదే రాజ్యం..!
దిశ ప్రతినిధి, మేడ్చల్: పేరుకే సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు.. కానీ అక్కడంతా డాక్యుమెంట్ రైటర్లదే హవా.. రిజిస్టేషన్ కార్యాలయాల సమీపంలో అనధికారికంగా ఆఫీసులను ఏర్పాటు చేసుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. కొనుగోలు, అమ్మకందారుల డాక్యుమెంట్లను రెడీ చేయాల్సిన రైటర్లు సబ్రిజిస్ట్రార్సిబ్బందికి అదనపు ఆదాయ వనరుగా మారారు. అక్రమాలు బయట పడకుండా, సిబ్బంది తప్పులు ఎవరికీ కనపడకుండా చూడడంలో వారిదే ప్రధాన పాత్ర. వారిని కాదంటే రిజిస్ట్రేషన్ఆఫీస్ లో ఫైళ్లు ముందుకు కదలదు. అధికారులు కొర్రీలు పెడుతూ పార్టీలను తిప్పించుకుంటారు. కొందరు రిజిస్ట్రార్లే ప్రైవేటు వ్యక్తులకు నెలనెలా కొంత మొత్తం చెల్లించి ఏజెంట్లుగా నియమించుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్లు లేనిదే పని కావడం లేదు. వారి ఆధ్వర్యంలో మా మూళ్ల పర్వం యథేచ్ఛగా సాగుతోంది. రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి అవినీతి మరక అంటకుండా వారి జేబుల్లోకి డబ్బులు దర్జాగా చేరుతున్నాయి. వారధులుగా డాక్యుమెంట్ రైటర్లు అనధికార విధులు నిర్వహిస్తున్నారు. నిబంధనల ప్రకారం సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలోకి డాక్యుమెంట్ రైటర్లను అనుమతించకూడదు. కానీ, అక్కడ ప్రతి పనీ వారి ద్వారానే జరుగుతోంది.
వారు చెబితేనే..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకునే పార్టీలు(అమ్మకం, కొనుగోలుదారులు) చలా నా రూపంలో నిర్ణీత మొత్తం చెల్లించాలి. రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యాక సంబంధిత డాక్యుమెంట్లు కొనుగోలు దారుల చేతికి రావాలి. ప్రభుత్వ నిబంధనలు ఇలా ఉన్నా పార్టీలు నేరుగా రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లకుండా అనధికారికంగా ఏర్పాటు చేసుకున్న డాక్యుమెంట్ రైట ర్ల ఆఫీసులనే ఆశ్రయిస్తున్నారు. సంబంధిత ఆస్తి విలువ ఆధారంగా పర్సంటేజీ రూపంలో రైటర్లు వారి నుంచి వసూలు చేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది పేరుతో స్టాంప్ డ్యూటీ చెల్లించే మొత్తంలో ఒక శాతం మామూళ్ల రూపం లో వసూలు చేస్తున్నారు. డాక్యుమెంట్ రైటర్ చెప్పినట్టు చేస్తే పని సాఫీగా సాగిపోతుంది. లేకుం టే కార్యాలయ సిబ్బంది సవాలక్ష కొర్రీలు పెడతా రు. దీనిని దృష్టిలో పెట్టుకొని క్రయ, విక్రయదారులు వారు అడిగినంత ఇచ్చుకొని పని పూర్తి చేయించుకుంటున్నారు. వసూలైన మొత్తం రోజం తా రైటర్ల దగ్గరే ఉంచుకుని సాయంత్రానికి సిబ్బంది కి అందజేస్తున్న విషయం బహిరంగ రహస్యమే.
అడ్డదారి ఆదాయమే..
హైదరాబాద్ తోపాటు శివారు ప్రాంతాల్లోని కొన్ని సబ్ రిజిస్ట్రార్ కేంద్రాలు అధిక ఆదా యాన్ని తెచ్చి పెట్టేవిగా ఉన్నాయి. ముఖ్యంగా నేషనల్ హైవేలతో పాటు వేగంగా విస్తరిస్తున్న మేడ్చల్, శామీర్ పేట, శంషాబాద్, కోకా పేట, పటాన్ చెరువు, ఘట్ కేసర్, మేడిపల్లి, కీసర, ఆదిభట్ల, రాజేంద్రనగర్ తదితర పట్టణ ప్రాంతాల చుట్టుపక్కల భూముల రిజిస్ట్రేషన్లు విస్తృతంగా జరుగుతున్నాయి. అక్కడి సబ్ రిజస్ట్రార్ కార్యాలయాలను బంగారు బాతుగుడ్లుగా సిబ్బంది భావిస్తుంటారు. ప్రతి నెలా వారు ప్రభుత్వం ద్వారా పొందే జీతానికి రెట్టింపు ఆదాయం అదనంగా వస్తోంది.
మున్సిపాలిటీలకు దగ్గరగా ఉన్న మండలాల్లో సైతం భారీగా భూముల ధరలు పలుకుతున్నాయి. మేడ్చల్ పట్టణం మున్సిపాలిటీ కావడం, నిజామాబాద్ కు వెళ్లే జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న భూముల్లో అధిక ధరలు పలుకుతున్నాయి. శామీర్ పేట, ఘట్ కేసర్, కీసరలోనూ భూములకు గిరాకీ ఏర్పడింది. దీనికి తోడు ఇటీవల సుచిత్ర, కొంపల్లి, బొడుప్పల్, పీర్జాదిగూడ, పటాన్ చెరువు, శంషాబాద్ లాంటి ప్రాంతాలలో జాతీయ రహదారులను ఆనుకుని పెద్ద ఎత్తున వ్యాపార కేంద్రాలు వెలుస్తున్న కారణం గా భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కొన్నిచోట్ల చెరువు ఎఫ్ టీ ఎల్, డీపట్టా భూములు సైతం రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోని డాక్యుమెంట్ రైటర్లకు ఆదాయం ‘మూడు పూలు.. ఆరు కాయలు’గా లభిస్తోంది.
యథేచ్ఛగా వసూళ్ల దందా..
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద ఎన్నో ఏళ్లుగా తిష్టవేసిన డాక్యుమెంట్ రైటర్లు రిజిస్ట్రేషన్లలో చక్రం తిప్పుతున్నారు. వారికి ఎలాంటి లైసెన్స్ లు లేవు. ఎలాంటి నియంత్రణ లేదు. డాక్యుమెంట్ రైటర్లు తయారు చేసి ఇచ్చిన డాక్యుమెంట్లనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది అంగీకరిస్తున్నారు. రైటర్లు తయారు చేసే ఒక్కో డాక్యుమెంట్ కు రూ.2వేల నుంచి రూ. 3వేల వరకు వసూలు చేస్తున్నారు. డాక్యుమెంట్ రైటర్లందరూ సిండికేట్ గా ఒకటే రేటును నిర్ణయించుకుని వసూలు చేస్తున్నారు. డాక్యుమెంట్ తయారీకి ఎంత తీసుకోవాలనే విషయమై ప్రభుత్వ నిర్ణయమేది లేదని రిజిస్ట్రార్ కార్యాలయ వర్గాలు తెలియజేస్తున్నాయి.
పైగా రైటర్ల వ్యవస్థ అనధికారం కావ డంతో వసూలు చేసే చార్జీలపై నియంత్రణ లేదు. రైటర్లు కొత్తగా డాక్యుమెంట్ తయారు చేసేదేమీ లేదు. కంప్యూటర్లలో పొందుపరిచి ఉన్న డాటానే మార్చి పావుగంటలో డాక్యు మెంట్ రేడీ చేసి చార్జీలు వసూలు చేస్తున్నా రు. ఆస్తుల రిజిస్ట్రేషన్ కు సంబంధించి ఎవై నా సమస్యలుంటే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల సిబ్బందికి కాసుల పండుగే. ఇలాం టి వాటికి రూ.50వేల నుంచి రూ.లక్షల వరకూ వసూలు చేస్తున్నట్లు తెలుస్తున్న ది. పలు సందర్భాలలో డాక్యుమెంట్లు సరిగా ఉన్నా ఏదో సమస్య సృష్టించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది పెండింగ్ లో పెడుతున్నారు. డబ్బు ముడితే కానీ అవి కదలవు. ఈ డబ్బును కూడా డాక్యుమెంట్ రైటరే వసూలు చేసి కార్యాలయ సిబ్బందికి అందజేస్తున్నట్లు సమాచారం. బహిరంగంగా ఈ కాసుల దందా సాగుతున్న ఏసీబీ అధికారులు మాత్రం ఇటువైపు తొంగి చూడడంలేదు.