వాజ్‌పేయికి ట్రీట్‌మెంట్ చేసిన డాక్టర్ ఇకలేరు!

by Anukaran |
వాజ్‌పేయికి ట్రీట్‌మెంట్ చేసిన డాక్టర్ ఇకలేరు!
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలోనే ప్రముఖ వైద్యురాలు డాక్టర్ పద్మావతి కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయస్సు 103 సంవత్సరాలు. అవివాహితురాలైన డాక్టర్ పద్మావతి కార్డియాలజిస్ట్ గా 1950 నుంచి ఢిల్లీలో వైద్యసేవలు అందించారు. ఇంగ్లాండ్ లో మెడిసిన్ చదివిన అనంతరం ఆమె ఢిల్లీకి వచ్చారు. ఈ క్రమంలో దేశ మొదటి ఆరోగ్యశాఖ మంత్రి రాజ్ కుమారి అమృత్ కౌర్ ఈమె గురించి తెలుసుకుని లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీలో అధ్యాపకురాలిగా పద్మావతిని నియమించారు. అప్పటి నుంచి తరగతులు చెబుతూనే వైద్య సేవలందిస్తూ వచ్చారు.

పలు పరిశోధనల్లో పాల్గొన్న ఈమె తమిళం, ఇంగ్లీష్, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. లాల్ బహదూర్ శాస్త్రీ, అటల్ బిహారీ వాజ్ పేయీ, ఇందిరాగాంధీతోపాటు పలువురు ప్రముఖులకు ఆమె వైద్య సేవలందించారు.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed