కరోనా తగ్గిందా.. అయితే వాటిని విసిరికొట్టండి

by vinod kumar |   ( Updated:2021-05-08 04:31:58.0  )
కరోనా తగ్గిందా.. అయితే వాటిని విసిరికొట్టండి
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా దేశంలో విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించడం ఒక ఎత్తయితే.. కరోనా బారి నుంచి బయటపడ్డాక మళ్లీ ఆరోగ్యకరమైన జీవన విధానానికి రావడం మరో ఎత్తు. కరోనా నుండి బయటపడ్డాం.. ఇక మళ్లీ కరోనా వచ్చే అవకాశం లేదు.. అని అనుకోకూడదు. వ్యాధినుండి బయటపడ్డాక.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. కరోనా బారిన పడ్డాకా వారు ఐసోలేషన్ లో ఉన్నప్పుడు వాడిన వస్తువులను వ్యాధి తగ్గాకా ఈ మాత్రం ముట్టుకోకూడదు. వ్యాధి ఉన్నప్పుడు వాడిన టూత్ బ్రష్, టంగ్ క్లీనర్ లాంటివి ఐతే అస్సలు వాడకూడదు. వాటిలో ఉన్న వైరస్ మళ్లీ మీ శరీరంలోకి వచ్చే అవకాశం ఉంది.

టూత్ బ్రష్ వలన కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని వైద్యులు స్పష్టం చేశారు. వ్యాధి సోకిన రోగి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు పడే తుంపర్లులోని వైరస్ బ్రష్ చేసేటప్పుడు దాని ఉపరితలం మీదనే ఉండిపోతుంది. దీనివలన వ్యాధి తగ్గాకా కూడా ఆ బ్రష్ మీద ఉండే వైరస్ మళ్లీ శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే కరోనా ఐసోలేషన్ లో ఉన్నప్పుడు వాడిన మీ పర్సనల్ వస్తువులను వ్యాధి తగ్గిన వెంటనే పడేయండి. ముఖ్యంగా టాయిలెట్ వస్తువులను తిరిగి వాడకుండా కొత్తవి వాడుకోవడం ఉత్తమమని వైద్యులు తెలుపుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed