- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BSP మీటింగ్‌కు వెళ్లొద్దు.. ఎమ్మెల్యే అనుచరుల బెదిరింపు కాల్ లీక్
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్(టి) ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అనుచరుల ఫోన్ కాల్ వ్యవహారం వైరల్‌గా మారింది. ఆదిలాబాద్‌లో జరిగే బీఎస్పీ మీటింగుకు వెళ్లవద్దంటూ నాయర్ నరేందర్ గౌడ్ ఓ వ్యక్తితో మాట్లాడిన ఆడియో టేప్ చక్కర్లు కొడుతోంది. తమ ఆదేశాలను లెక్క చేయకుండా మీటింగ్‌కు వెళితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎమ్మెల్యే కోనప్ప అనుచరుల ఆడియో టేప్ వ్యవహారం ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు ప్రధాన అనుచరుడిగా ఉన్న బెజ్జూర్ పీఏసీఎస్ ఛైర్మన్ అర్షద్ హుస్సేన్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. సుమారు 22సంవత్సరాలుగా కోనప్పకు ప్రధాన అనుచరుడిగా ఉన్న అర్షద్, ఎమ్మెల్యేతో పొసగక శుక్రవారం టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అర్షద్ బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)లో చేరేందుకు నిర్ణయించుకోగా, శనివారం రోజున ఆదిలాబాద్‌లో బీఎస్పీ ఇంచార్జి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో చేరుతున్నారు. తన అనుచరులు, సన్నిహితులతో కలిసి చేరేందుకు సిద్ధమవగా, మిగతా నాయకులు, కార్యకర్తలు వెళ్లకుండా అడ్డుకునేందుకు ఎమ్మెల్యే కోనప్ప అనుచరులు రంగంలోకి దిగారు. దీంతో కొందరితో మాట్లాడిన ఆడియో టేపు వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీఎస్పీ మీటింగ్‌కు ఎవరూ వెళ్లవద్దు, ఎవరైనా వెళ్తే వాళ్లని తొక్కమని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పోలీసులకు, టీఆర్‌ఎస్ నాయకులకు చెప్పారని, మాట కాదని బీఎస్పీ మీటింగ్‌కు వెళ్తే.. తీవ్ర పరిణామాలు ఉంటాయి అనే ఆడియో టేప్ వ్యవహారం సంచలనంగా మారింది.