- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పాలకులకు మద్యంపై ఉన్న శ్రద్ధ ప్రజల సంక్షేమంపై లేదు..
దిశ, నాచారం: నూతనంగా ఏర్పాటు చేసే వైన్ షాప్‌లకు అనుమతి ఇవ్వోద్దంటూ.. అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్), భారత జాతీయ మహిళా సమాఖ్య(ఎస్ఎఫ్ఐ డబ్ల్యూ) ఉప్పల్ మండల సమితి ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. మల్లాపూర్ శివ హోటల్ లో నూతనంగా ఏర్పాటు చేయబోతున్న వైన్ షాప్, పర్మిట్ రూమ్ లకు పూర్తి స్థాయి అనుమతులు ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. ఆయా సంఘాల ఆధ్వర్యంలో మల్లాపూర్ లో మహిళలు, విద్యార్థినులతో కలిసి వైన్ షాప్ కు పూర్తి స్థాయి అనుమతి ఇవ్వొద్దు అనే నినాదంతో సంతకాల సేకరణ జరిగింది.
అనంతరం ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి సత్య ప్రసాద్, ఎస్ఎఫ్ఐ డబ్ల్యూ ఉప్పల్ మండల అధ్యక్షురాలు సుగుణ లు మాట్లాడారు. మల్లాపూర్ శివ హోటల్ ముందు అనేక దశాబ్దాలుగా బస్ స్టేషన్ ఉన్నదని, ఈ బస్ స్టేషన్ కు రోజూ కొన్ని వందల మంది ప్రజలు, మహిళలు, విద్యార్థినులు ప్రయాణం చేస్తుంటారని తెలిపారు. అయితే ఈ బస్ స్టేషన్ కు వెనకాలే వైన్ షాపు ఏర్పాటుకు ఆబ్కారీ శాఖ ఏ విధంగా లైసెన్స్ ఇస్తుందో స్పష్టం చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. పాలకులకు మద్యం పై ఉన్న శ్రద్ధ ప్రజల సంక్షేమం పై లేకపోవడం బాధాకరమన్నారు. మల్లాపూర్ శివ హోటల్ లో ఏర్పాటు చేయబోయే వైన్ షాప్ కు తక్షణమే అబ్కారీ శాఖ పూర్తి స్థాయి అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని వారు హెచ్చరించారు.
- Tags
- AIYF