- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లక్షణాలు సేమ్.. కానీ, కరోనా కాదంట
దిశ, న్యూస్ బ్యూరో: టాన్సిలిటిస్ ఐదేండ్లు మొదలుకొని 15 సంవత్సరాల వయసున్న చిన్నారుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీని ప్రధాన లక్షణాలు గొంతు నొప్పి, గొంతులో మంటతో పాటు జ్వరం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇవే లక్షణాలు కొవిడ్‌కు ఉండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతుండగా, చిన్నారులకు వైద్యం అందించడం కూడా వైద్యులకు ఇబ్బందిగా మారింది. కొవిడ్ లక్షణాలకు టాన్సిలిటిస్ లక్షణాలకు ఉన్న తేడాలపై అవగాహన పెంచుకొని సరైన చికిత్స అందేలా ప్రయత్నించాలని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్ డా.సయ్యద్ అబ్దుల్ హకీం అంటున్నారు. ఈ లక్షణాలు కొనసాగిన కాలాన్ని బట్టి వ్యాధి తీవ్రతను సాధారణ క్రానిక్ గా భావించాల్సి ఉంటుంది. కొంత మంది చిన్నారుల్లో డిప్తీరియా కారణంగా, ఇతర వ్యాధి వల్ల కూడా టాన్సిలిటిస్ లక్షణాలు కనిపిస్తాయి.
టాన్సిలిటిస్ లక్షణాలు..
విపరీతమైన గొంతు నొప్పి, గొంతులో మంట.
గొంతు బొంగురుపోతుంది.
ఏదైనా మింగడానికి ఇబ్బంది కావడం.
నోటి నుంచి దుర్వాసన.
101 పైగా జ్వరం.
మెడ నిటారుగా ఉండడం.
ఆకలి ఉండదు.
చికిత్స విధానం..
వ్యాధి లక్షణాలు కనిపించడంతో పాటు జ్వరం తగ్గకుండా రెండు, మూడు రోజులు కొనసాగితే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. వ్యాధి తీవ్రత, చిన్నారుల్లో వ్యాధి హిస్టరీని బట్టి వైద్యులు చికిత్స అందిస్తారు. టాన్సిలెక్టమీ అనే ఆపరేషన్ ద్వారా టాన్సిల్ ను తొలగిస్తారు. ఆధునిక వైద్య పద్ధతుల్లో ఈ సర్జరీని ఎక్కువ రక్తం కోల్పోకుండా కోబ్లేషన్ అనే విధానంలో చేస్తున్నారు. సర్జరీ అయిన తర్వాత కేవలం 8 గంటల్లో హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్లవచ్చు.
జాగ్రత్తలు..
తరుచూ చేతులు కడుక్కుని నీళ్లు తాగుతుండాలి. గోరు వెచ్చని నీటితో పుక్కిలించాలి. సాధ్యమైనంత వరకు కలుషిత వాతావరణం ఉన్న ప్రదేశాలకు వెళ్లొద్దు. పరిసరాల శుభ్రతతో పాటు వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి.