- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫుట్ పాత్ వ్యాపారులకు న్యాయం చేస్తా: తలసాని
దిశ, కంటోన్మెంట్: పుట్ పాత్ లపై వ్యాపారాలు నిర్వహించుకొనే వారికి తగు న్యాయం జరిగేలా చూస్తానని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి బాటా వరకు చేపట్టిన వైట్ టాపింగ్ రోడ్ నిర్మాణం పూర్తయి పుట్ పాత్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సోమవారం పుట్ పాత్ వ్యాపారులతో మోండా మార్కెట్ లో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల ఇబ్బందులను తొలగించేందుకే ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి రోడ్లు, పుట్ పాత్ ల నిర్మాణం చేపడుతుందని అన్నారు. రోడ్లపై, పుట్ పాత్ లపై అక్రమంగా వ్యాపారాలు నిర్వహిస్తుండటం వలన ప్రజలు, వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. తోపుడు బండ్లు, పుట్ పాత్ వ్యాపారులకు న్యాయం జరిగేలా చూస్తానని ప్రకటించారు. ఎంతమంది వ్యాపారులు ఉన్నారు, వారికి ఎంత స్థలం అవసరమో సర్వే చేసి నివేదిక ఇవ్వాలని ట్రాపిక్ పోలీస్ అధికారులను మంత్రి ఆదేశించారు.
ఈ సమావేశంలో కార్పొరేటర్ ఆకుల రూప, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డీసీ ముకుంద రెడ్డి, వాటర్ వర్క్స్ జీ ఎం రమణారెడ్డి, టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీనివాస్, ట్రాపిక్ ఏసీపీ రాములు నాయక్, సీఐ శంకర్ యాదవ్, ట్రాపిక్ సీఐ నాగేశ్వర్ రావు, వెటర్నరీ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఏఈ రవి తదితరులు ఉన్నారు.