- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అమ్మాయిలు ఆటలు ఆడాలంటే బట్టలు విప్పాల్సిందేనా..?
దిశ, ఫీచర్ : స్పోర్ట్స్ వరల్డ్.. లింగ వివక్షకు కేరాఫ్ అడ్రస్. అబ్బాయిల సక్సెస్‌కు సెలబ్రిటీ స్టేటస్ అందిస్తోన్న ఈ ప్రపంచం.. అమ్మాయిల విన్నింగ్ కేపబిలిటీస్‌తో వారి ఐడెంటిటీని ప్రశ్నిస్తోంది. అంచనాలకు మించి రాణిస్తే అసలు అమ్మాయే కాదంటూ ముద్రవేస్తోంది. జెండర్ టెస్ట్‌తో వారి జీవితాలను సర్వనాశనం చేస్తోంది. మీడియా అత్యుత్సాహం ఇంటర్నేషనల్ ఫేమ్‌ను సైతం ఇండియన్ షేమ్ అనిపిస్తే.. సమాజం వారిని తలెత్తుకోలేకుండా చేస్తోంది. ఈ క్రమంలోనే దేశం కోసం చెమట, రక్తం చిందించిన ఉమెన్ అథ్లెట్స్ అవమానభారంతో ఆత్మహత్య చేసుంటున్నారు. డిప్రెషన్‌తో నాలుగు గోడలకే పరిమితం అవుతున్నారు.
ఇలా అథ్లెట్ల బతుకును అపహాస్యం చేస్తున్న విధానాలను.. ద్యుతీ చంద్రన్ లాంటి బ్రేవ్ ఉమన్ చాలెంజ్ చేసింది. బ్లడ్‌లో టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఎక్కువున్నా తాను అమ్మాయినేనని ప్రూవ్ చేసి.. కోల్పోయిన మెడల్స్‌ను వెనక్కి తెచ్చుకుంది. ఇలాంటి స్టోరీస్ ఇన్‌స్పిరేషన్‌గా తెరకెక్కిన ‘రష్మి రాకెట్’.. టెస్టోస్టిరాన్ లెవెల్స్ అంటే ఏమిటి? అమ్మాయిల్లో ఎక్కువుంటే తను నేచురల్ ఉమన్ కాదా? సైన్స్ ఏం చెప్తోంది? ఇంటర్నేషనల్ గైడ్‌లైన్స్‌ను ప్రశ్నించాల్సిన అవసరమేంటి? అనే పాయింట్స్‌తో సొసైటీ అండ్ స్పోర్ట్స్ అథారిటీని క్వశ్చన్ చేసింది. ఇప్పటికే ఉన్న లైంగిక అసమానత జెండర్ టెస్ట్‌తో ఏ లెవల్‌కు వెళ్తుంది? ఎలాంటి కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేస్తుందో? చర్చించింది.
క్రీడా ప్రపంచంలో మహిళలు, బలహీన వర్గాల పట్ల వివక్ష ఉందనేది చరిత్ర. 1896 ఒలింపిక్స్ మొదటి ఎడిషన్‌లో మహిళలు పాల్గొనకుండా నిషేధించారు. ఆ సమయంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) స్థాపకుడు మహిళలతో ఒలింపిక్స్ ‘అసాధ్యమైన, రసహీనమైన, అనాలోచిత, అసభ్యకర’ విషయంగా పేర్కొన్నాడు. ఆటలు అనేవి పురుషుల గంభీరత్వాన్ని ప్రదర్శించేందుకు కాగా.. ఆడవారు చప్పట్లను బహుమతిగా ఇచ్చేందుకు సృష్టించబడ్డారనే స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇక IOC మహిళా అథ్లెట్లకు చాన్స్ ఇచ్చేందుకు వెనకాడగా.. స్త్రీత్వం ఆధిపత్య ఇమేజ్‌కు ముప్పు రాకుండా జాగ్రత్త పడిందనే విమర్శలు ఎదుర్కొంది. అయితే 2012 లండన్ ఒలింపిక్స్‌లో తొలిసారిగా మహిళలు అన్ని క్రీడల్లో పాల్గొనగా.. ఇప్పటికీ ఇంటర్నేషనల్ లెవెల్‌లో వారిపై వివక్ష కొనసాగుతూనే ఉంది. ఇంటర్నేషనల్ కౌన్సిల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉమెన్‌కు సమస్యగా మారుతూనే ఉన్నాయి.
రష్మి సక్సెస్ స్టోరీ…
గుజరాత్‌లోని ఓ గ్రామానికి చెందిన ‘రష్మి’ చిన్నప్పటి నుంచే తన రన్నింగ్ స్పీడ్‌తో ‘రష్మి రాకెట్’గా పిలవబడుతుంది. తండ్రి సపోర్ట్‌తో ఆల్మోస్ట్ అబ్బాయిగానే పెరిగిన అమ్మాయి.. గ్రామంలోని అమ్మాయిల సమస్యలను పరిష్కరించే తల్లి కన్సర్న్‌ను ఇష్టపడటంతో పాటు తనూ అలాగే ఆలోచిస్తూ పెరుగుతుంది. కానీ తన లైఫ్‌లో జరిగిన ఓ ఇన్సిడెంట్‌తో అథ్లెట్ కెరియర్‌కు ముగింపు చెప్పిన రష్మి.. పురాణ చరిత్ర కలిగిన ఆ ఏరియా గైడ్‌గా మిగిలిపోతుంది. ఈ క్రమంలో ఆర్మీ కెప్టెన్‌ను మీట్ అయిన తను.. అతని హెల్ప్‌తో మళ్లీ రన్నింగ్ మొదలుపెడుతుంది. వన్ బై వన్ రికార్డ్స్ బ్రేక్ చేసుకుంటూ లోకల్ టు నేషనల్ ఫేమ్ పొంది ఇంటర్నేషనల్ గేమ్స్‌లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించే అవకాశం అందుకుంటుంది.
ఈ క్రమంలోనే ఇండియన్ అథ్లెట్ అసోసియేషన్‌లో శిక్షణ తీసుకునేందుకు వెళ్లిన రష్మి.. అక్కడి పొలిటికల్ స్ట్రాటెజీస్‌కు బలవుతూనే ఉంటుంది. ఐఏఏ బోర్డు మెంబర్స్‌లో ఒకరైన దిలీప్ చోప్రా తన కూతురి కెరియర్ కోసం రష్మిని పక్కకు తప్పించేందుకు ట్రై చేస్తాడు. తన డాటర్‌ను ఫేమస్ చేసేందుకు రష్మికి జెండర్ టెస్ట్ చేయాలంటూ ఆదేశిస్తాడు. ఈ టైమ్‌లో బ్లడ్ టెస్ట్‌తో పాటు తన ఒంటిమీదున్న బట్టలన్నీ తొలగించి అల్ట్రా సౌండ్ టెస్ట్ చేసి అవమానించడం, దిలీప్ చోప్రా కూతురు నిహారిక ప్రొవోక్ చేసే విధానంతో రష్మి సహనం కోల్పోతుంది. నిహారికపై చేయి చేసుకోవడంతో జెండర్ టెస్టింగ్ రిజల్ట్, అన్‌డిసిప్లనరీ యాక్ట్ కింద తనను బ్యాన్ చేస్తారు.
పైగా అదే రాత్రి క్యాంపస్‌లోకి ఎంటరైన మేల్ పోలీస్.. రష్మిని అరెస్ట్ చేసి ఏ విధంగా ట్రీట్ చేస్తారు? వారికి ఇన్‌ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? ఆమె జైలు నుంచి ఎలా బయటపడుతుంది? జెండర్ టెస్ట్ రిజల్ట్స్ వచ్చేందుకు మినిమమ్ రెండు రోజులు టైమ్ పడుతుంది కానీ అరెస్ట్ అయిన 15 నిమిషాలకే ఈ విషయం మీడియాకు ఎలా లీకైంది? ఇది విషయం వైరల్ అయ్యాక ఎంటరైన యంగ్ లాయర్, రష్మిని ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి తనకు ఎలా సపోర్ట్ చేశారు? అసలు అమ్మాయే కాదన్న రష్మికి న్యాయం జరుగుతుందా లేదా? తనపై ఉన్న బ్యాన్ ఎత్తేయబడుతుందా లేదా? అనేది కథ.
రైజింగ్ పాయింట్స్…
1. ఇంటర్‌సెక్స్ ఉమెన్ లేదా సెక్స్ డెవలప్‌మెంట్‌లో తేడాలున్న మహిళల్లో సహజంగా టెస్టోస్టిరాన్ లెవల్స్ అధికంగా ఉంటాయి.
2. జెండర్ టెస్ట్‌కు ఒప్పుకోకపోతే అథ్లెట్ జీవితం ప్రశ్నార్థకమేనా?
3. అమ్మాయిలో టెస్టోస్టిరాన్ లెవెల్స్ హై ఉంటే.. మేల్ ట్రాన్స్‌జెండర్ అనే ముద్రవేస్తారా?
4. జెండర్ టెస్ట్‌పై ఇప్పటికే చాలా దేశాలు క్వశ్చన్ చేశాయి.. ఇండియా ఎందుకు చేయలేకపోతోంది?
5. టెస్టోస్టిరాన్ లెవెల్స్ అథ్లెట్స్ పర్‌ఫార్మెన్స్‌పై ఎలాంటి ఇంపాక్ట్ చూపవు
6. టెస్టోస్టిరాన్ లెవల్స్ అధికంగా ఉండటంతో ఇరెగ్యులర్ పీరియడ్స్, బాడీపై హెయిర్ గ్రోత్ సమస్యలు ఎదుర్కొంటారు
7. ఇండియన్ అథ్లెట్స్ అసోసియేషన్.. మెన్ అథ్లెట్స్‌కు బయాస్‌డ్‌గా ఉంటుంది. బెటర్ ఫెసిలిటీస్, పేమెంట్స్, స్పాన్సర్‌షిప్స్ అందిస్తోంది.
– సుజిత రాచపల్లి