- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘మోడీ టార్చర్‌తోనే ఆ ఇద్దరు మంత్రుల మరణం’
చెన్నై: ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) చీఫ్ ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారు. మోడీ టార్చర్ వల్లే ఇద్దరు కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీలు మరణించారని ఆరోపణలు చేశారు. అంతేకాదు, బీజేపీ సీనియర్ లీడర్ ఎం వెంకయ్య నాయుడునూ పక్కకు తప్పించారని అన్నారు. ‘వారందరినీ మీ దారికి అడ్డుతగలకుండా పక్కకు తప్పించారు. కానీ, మిస్టర్ మోడీ, మీ ముందు మోకరిళ్లడానికి నేను సీఎం పళనిస్వామిని కాదు. నేను ఉదయనిధి స్టాలిన్. కలైంజ్ఞర్ వారసుడిని’ అని పీఎం మోడీ, తమిళనాడు సీఎం ఈపీఎస్‌పై ఆరోపణలు చేశారు.
ఉదయనిధి స్టాలిన్ చేసిన ఈ వ్యాఖ్యలను దివంగత మంత్రుల కుటుంబీకులు ఖండించారు. మీ ఎన్నికల ప్రచారానికి తమ తల్లి జ్ఞాపకాలను దుర్వినియోగం చేయవద్దని సుష్మా స్వరాజ్ తనయురాలు బాన్సురి స్వరాజ్ ట్వీట్ చేశారు. ఉదయనిధిపై ఎన్నికల ప్రెజర్ ఉన్నదని అర్థమవుతున్నదని, కానీ, అందుకు తన తండ్రి పేరును వాడుకోవద్దని, ప్రధానమంత్రి, తన తండ్రి మధ్య రాజకీయానికి అతీతమైన బంధమున్నదని అరుణ్ జైట్లీ కూతురు సోనాలి జైట్లీ బక్షి పేర్కొన్నారు.