బ్యాడ్మింటన్ క్రీడా అభివృద్ధికి జిల్లాల్లో శిక్షణ కేంద్రాలు : పుల్లెల గోపీచంద్

by Shyam |
Pullela Gopichand
X

దిశ, కోదాడ : తెలంగాణలో ప్రతిభగల క్రీడాకారులకు కొదవలేదని బ్యాడ్మింటన్ అంతర్జాతీయ క్రీడాకారుడు, కోచ్ పుల్లెంల గోపీచంద్ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో బ్యాడ్మింటన్ క్రీడాకారుడు తోట రంగారావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత మూడు ఒలంపిక్స్ పోటీల్లో భారత దేశానికి పతకాలు రావడం శుభపరిణామం అన్నారు. రాబోయే రెండు నెలల్లో రాష్ట్రంలో పెద్ద స్థాయిలో టోర్నమెంట్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఈ టోర్నమెంట్ల ద్వారా క్రీడాకారుల ర్యాంకింగ్ మెరుగవుతుందని, తద్వారా అంతర్జాతీయ స్థాయికి క్రీడాకారులు ఎదిగే అవకాశం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా, పిట్ ఇండియా స్కీంల ద్వారా క్రీడారంగాన్ని ప్రోత్సహించడం అభినందనీయం అన్నారు.

తెలంగాణలో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందించిదన్నారు. ఎక్కడైనా ప్రతి పిల్లవాడు ఆడుకోవడానికి మైదానం ఉంటే చాలని, మైదానాలను ఏర్పాటు చేసి క్రీడాకారులను ప్రోత్సహించాలన్నారు. కోదాడలోని ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియం ఉన్నతమైన ప్రమాణాలతో ఉన్నదని, క్రీడాకారులు క్రీడా అభివృద్ధితోపాటు ఆరోగ్యాలను కాపాడుకుంటున్నారని కొనియాడారు. ఒలంపిక్స్ విజేత పీవీ సింధుకు ఉజ్వల భవిష్యత్తు ఉందని, జరగబోయే ఒలంపిక్స్‌లో రాణించి దేశానికి వన్నె తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామీణ స్థాయి నుంచి బ్యాడ్మింటన్ క్రీడలో ప్రతిభను మెరుగుపరుచుకునేందుకు జిల్లాస్థాయిలో బ్యాడ్మింటన్ శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Badminton

అనంతరం తోటా రంగారావు మాతృమూర్తి సంతాప సభలో పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆమె మృతి చాలా బాధాకరం అన్నారు. తోట రంగారావును పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఆవుల రామారావు, మాజీ సర్పంచ్ పార సీతయ్య, జేఏసీ నాయకులు బంగారు నాగమణి, వేముల వెంకటేశ్వర్లు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ బుడిగం నరేష్, కోట శ్రీనివాస్, జుట్టుకొండ బసవయ్య, జీవి రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed