8500 కుటుంబాలకు పండ్ల పంపిణీ

by Shyam |
8500 కుటుంబాలకు పండ్ల పంపిణీ
X

దిశ, వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 8500 కుటుంబాలకు ఎమ్మెల్యే‌ పెద్ది సుదర్శన్ రెడ్డి, రూరల్ కలెక్టర్ హరిత శుక్రవారం ఒక కిలో చొప్పున పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 179 గ్రామ పంచాయతీలోని 60 వేల పైచిలుకు కుటుంబాలకు వారం రోజుల్లో పండ్ల పంపిణీ పూర్తి చేస్తామన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి రోగ నిరోధక శక్తిని పెంచేందుకు పండ్ల పంపిణీ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. ఇందుకు సహకరించిన దాతలందరికీ ఆయన అభినందనలు తెలిపారు.

tags : Distribution,fruits,8500 families,warangal,MLA sudarshan reddy,collector

Next Story