- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతి సిమెంట్ బస్తా నుంచి ఒక రూపాయి తీసి..
దిశ, మునుగోడు: జువారీ సిమెంట్ యాజమాన్యం వారి సహకారంతో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో జువారీ సిమెంట్ యాజమాన్యం ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ వ్యాపారంలో లాభాల కోసమే కాకుండా పేద ప్రజలను ఆదుకోవాలనే ఆశయంతో పని చేస్తున్న జువారీ సిమెంటు యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో జువారీ సిమెంట్ జనరల్ మేనేజర్ తిలక్ బాబు పాల్గొని మాట్లాడుతూ ప్రతి సిమెంట్ బస్తా నుండి ఒక రూపాయి నిరుపేద ప్రజల నిత్యావసర సరుకుల పంపిణీ కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ అనిల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ యం.రామదుర్గా రెడ్డి, జగన్నాథ్ ట్రేడర్స్ యజమాని, మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.