70 కేజీల బరువెత్తిన లోఫర్ బ్యూటీ

by Jakkula Samataha |   ( Updated:2023-12-15 17:05:08.0  )
70 కేజీల బరువెత్తిన లోఫర్ బ్యూటీ
X

దిశ, సినిమా : సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ.. హాట్ ఫొటోషూట్స్, మూవీ షూటింగ్స్, ఇతరత్రా విషయాలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టా వేదికగా పంచుకుంటూ ఉంటుంది. ఇక తెలుగులో వరుణ్ తేజ్ సరసన ‘లోఫర్’ సినిమా చేసిన ఈ భామ.. తాజాగా తన జిమ్ వీడియోను ‘సమ్ ఆఫ్ మై ఫేవరెట్.. గో టు ఎక్సర్‌సైజెస్’ క్యాప్షన్‌తో పోస్ట్ చేసింది.

ఇందులో 70 కేజీల బ‌రువును అల‌వోక‌గా భుజాలపైకి ఎత్తి తన ఫిట్‌నెస్ ఏంటో చూపించింది. ఆ తర్వాత 30 కేజీల ఎలివేటెడ్ డ్రమ్స్‌తో వర్క్ అవుట్స్ చేసింది. ఈ వర్కవుట్ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా దిశ ప్రస్తుతం ‘ఏక్ విలన్ రిటర్న్స్, రాధే : ది మోస్ట్ వాంటెడ్ భాయ్’ చిత్రాల్లో ఫిమేల్ లీడ్‌గా నటిస్తోంది.

Advertisement

Next Story