- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ వ్యాధులు వస్తున్నాయి: ఈటల
దిశ ప్రతినిధి ,హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో కష్టపడి పనిచేసే వారికి గతంలో కొన్ని రోగాలు దరిచేరేవి కావని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. డయాబెటిస్‌ను రిచ్ మాన్ డిసీజ్‌గా గతంలో చెప్పేవారని , కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికీ బీపీ, షుగర్ వ్యాధులు వస్తున్నాయని తెలిపారు. ఆర్థిక స్తోమతతో సంబంధం లేకుండా జబ్బులు వస్తున్నాయని… దీనివల్ల ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తోందని పేర్కొన్నారు. బేగంపేట్‌లోని వివేకానంద హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో మంత్రి ఈటల పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఈటల మాట్లాడుతూ… అనుకోని రోగాలు వచ్చినప్పుడు వైద్యం ఖర్చు ఒక్కసారిగా మీద పడుతుందని చెప్పారు. వాటిని భరించడం పేద, మధ్య తరగతి ప్రజలకు భారంగా మారిందన్నారు. గుడిసెలో ఉండే వారికైనా , బంగ్లాలో ఉన్న వారికైనా ప్రాణాలు కాపాడుకోవాలని ఆరాటం ఒకే విధంగా ఉంటుందన్నారు. ఇందు కోసం లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నామని, పేద కుటుంబాలు పెద్ద జబ్బులు వస్తే అంధకారంలో మునిగిపోతున్నాయని గుర్తు చేశారు. క్యాన్సర్ లాంటి జబ్బులకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.