- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రేపు ఏపీ కేబినెట్ భేటీ.. ఆ వివాదంపై చర్చ
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ క్యాబినెట్ భేటీ బుధవారం జరగనుంది. సీఎం జగన్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఇటీవల తీసుకువచ్చిన నూతన ఐటీ విధానంపై ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. ఇదే సమావేశంలో ఐటీ విధానానికి ఆమోదం తెలుపనున్నారు. అంతేకాకుండా, జాబ్ క్యాలెండర్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలతో జల వివాదాలు, టిడ్కో ఇళ్ల నిర్మాణం, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల రెగ్యులరైజేషన్, ప్రైవేటు విశ్వవిద్యాలయాల నియంత్రణ, అమ్మఒడిలో భాగంగా విద్యార్థులకు ల్యాప్ టాప్ ల పంపిణీ తదితర అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు, ధర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు సన్నద్ధతపైనా చర్చ జరగనుంది. ఈ ఏడాది మిగిలిన సంక్షేమ పథకాల అమలుపైనా కేబినెట్ చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.
Advertisement
Next Story