ఏపీ, తమిళనాడు మధ్య అడ్డుగోడలు

by srinivas |   ( Updated:2020-04-26 22:31:54.0  )

కరోనా వైరస్ వేగంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య రాకపోకలు నిషేధించారు. రాష్ర్ట సరిహద్దుల్లో రహదారులపై తమిళనాడు ప్రభుత్వం గోడలు కట్టించింది. పలమనేరు, తమిళనాడు మధ్య గుడియాట్టం రోడ్డు గోడ నిర్మాణం చేశారు.తిరుత్తణి, శెట్టితంగాళ్, బొమ్మనసముద్రం ప్రాంతాల్లో సైతం రోడ్లపై గోడలు కట్టించారు. ఆరు అడుగుల ఎత్తులో తమిళనాడు ప్రభుత్వం గోడలు నిర్మించింది. ఈ గోడల నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాధికారులు అభ్యంతరం వ్యక్తం చేసింది.

Tags : Transport, borders, Andhra Pradesh, Tamil nadu, corona virus, walls

Advertisement
Next Story