శ్రీలంక కెప్టెన్ మరో అరుదైన రికార్డు

by Shyam |
శ్రీలంక కెప్టెన్ మరో అరుదైన రికార్డు
X

దిశ, వెబ్‌డెస్క్: వెస్టిండీస్‌తో మ్యాచ్‌ సందర్భంగా శ్రీలంక టెస్టు కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నే అరుదైన రికార్డు సాధించాడు. లంక తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఓపెనర్‌గా నిలిచాడు. 137 ఇన్నింగ్స్‌లో 5374 పరుగులు సాధించి సనత్‌ జయసూర్య 5932 తర్వాతి స్థానం దక్కించుకున్నాడు. మరో 558 పరుగులు చేస్తే జయసూర్య రికార్డును కరుణరత్నే అధిగమిస్తాడు. ఇక ఈ జాబితాలో తర్వాతి మూడు స్థానాల్లో మర్వన్‌ ఆటపట్టు 5317, దిల్షాన్‌ 2170, ఆర్‌ఎస్‌ మహానామా 2069 ఉన్నారు.

ఇదిలా ఉండగా ఈ క్యాలెండర్‌ 2021 ఇయర్‌లో టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కరుణ రత్నే(854) మూడో స్థానంలో ఉన్నాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 3 అర్ధ సెంచరీలు ఉండటం విశేషం. ఈ జాబితాలో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌(1455), టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(906) టాప్‌-2లో కొనసాగుతున్నారు.

Advertisement

Next Story