- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దీదీ.. నువ్వు అదే రోజు ఓడిపోయావ్: మోడీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో మూడో విడత ఎన్నికలు జరుగుతుండగా కూచ్‌బెహార్‌లోని ఓ ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మాట్లాడుతూ తృణమూల్ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. మమతా బెనర్జీకి ఓటమి భయం పట్టుకుందని అన్నారు. ‘నందిగ్రామ్‌లోని ఓ పోలింగ్ బూత్‌లో నువ్వు గేమ్ ఆడినప్పుడే ఓడిపోయావ్. అదే రోజు నువ్వు ఓడిపోయావని దేశ ప్రజలకు అర్థమైంది’ అని పేర్కొన్నారు. ‘బెంగాల్‌లో 80శాతం పోలింగ్ శాతం నమోదవుతున్నది. దీన్ని చూసి దీదీ గర్వపడలేకపోతున్నారు. ఎందుకంటే టీఎంసీ పరాజయాన్ని మూటకట్టుకోనుంది.
ఈ ఎన్నికల్లో దీదీ సొంత గోల్(ఫుట్‌బాల్‌తో పోల్చుతూ.. ) చేసుకున్నారు’ అని విమర్శలు చేశారు. ‘ఇటీవలే మైనార్టీల ఓట్లు చీలకూడదని, కలిసి కట్టుగా ఓటేయాలని దీదీ వారిని కోరారు. ముస్లింలే మీ ఓటు బ్యాంకు అని చెప్పకనే చెప్పారు. కానీ, ఇప్పుడు వారు కూడా దీదీ చేజారిపోతున్నారనీ అర్థమైంది. ఈ విషయాలే దీదీ, ఓడిపోతున్నారని చెబుతున్నాయి’ అని వివరించారు. పదేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శాలు చేశారు.