- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబు మాట నెగ్గేనా !
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం రక్తికట్టిస్తోంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఏపార్టీ నుంచి ఎవరు విమర్శలు ఎక్కుపెట్టినా స్ట్రాంగ్ కౌంటర్లతో బొమ్మ దద్దరిల్లిపోతుంది. 2019ఎన్నికల ఫలితాల తర్వాత కేవలం నెలరోజులే సైలెంట్‌గా సాగిన రాజకీయం మునుపటి బాట పట్టి రసవత్తరంగా మారుతూ వస్తోంది. ముఖ్యంగా పాలనా పగ్గాలు చేపట్టాక ప్రధానంగా సంక్షేమ పథకాలపై జగన్ సర్కార్ దృష్టిపెట్టింది. ఇదేక్రమంలో వాటిలోని లోపాలను వెదుకుతూ టీడీపీ ఎప్పటికప్పుడు మీడియాలో నానుతూ వస్తోంది. అయితే సీఎం జగన్ అసెంబ్లీలో మూడు రాజధానుల అంశాన్ని లేవనెత్తడంతో ఒక్కసారిగా పొలిటికల్ గేర్ మారిపోయింది. దీనిపై మండలిలో టీడీపీ రచ్చ చేయడం.. జగన్‌కు చిర్రెత్తి మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేయడం జరిగిపోయింది. కానీ ఇంతలోనే కరోనా ఎంటరై కొద్దిరోజులు సాధాసీదా ఉన్న రాజకీయ శైలి.. మళ్లీ గవర్నర్ మూడు రాజధానుల బిల్లుకు ఓకే చెప్పడంతో ఒంటికాలిపై లేస్తున్న టీడీపీ రాజకీయాన్ని రంజుగా మార్చింది.
మూడురోజుల క్రితం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు జగన్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. మేనిఫెస్టోలో మూడు రాజధానుల అంశాన్ని చేర్చలేదని, ఇప్పుడు ప్రజల అనుమతి లేనిది ఎందుకు ముందుకు పోతున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని ప్రజల వద్దే తేల్చుకుందామని అందుకు వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. 48గంటల్లో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో వైసీపీ వైపు ప్రజలు నిలబడితే మీరు ఎక్కడ రాజధానులు పెట్టుకున్నా టీడీపీ ఏం మాట్లాడదని కుండబద్దలు కొట్టారు. కానీ ఈ సమయంలోనే వైసీపీ, టీడీపీ మధ్య టఫ్ వార్ నడిచింది. 151మంది ఉన్న మేం రాజీనామా చేయడం కాదని.. 23మంది టీడీపీ ఎమ్మెల్యేలే రాజీనామా చేసి గెలిస్తే.. అమరావతే రాజధానిగా కొనసాగిస్తామని స్ట్రాంగ్ కౌంటర్‌లు ఇచ్చుకున్నారు. అయితే 48గంటల్లో ఏం తేలకపోవడంతో మళ్లీ మీడియా ముందుకు వచ్చిన చంద్రబాబు జగన్‌కు సవాల్ విసిరి మరో 48గంటల టైమ్ పెట్టి వెళ్లిపోయారు. మళ్లీ ఇరుపార్టీల మధ్య రాజీనామాల అంశమే తెరపైకి తెస్తున్నారు.
అయితే ఇదేక్రమంలో చంద్రబాబు చేస్తున్న సవాల్‌పై రాజకీయ నేతలతో పాటు విశ్లేషకుల నుంచి మరో వాదన తెరపైకి వస్తోంది. టీడీపీ నుంచి గెలిచిన 23మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే ముగ్గురు నలుగురు వైసీపీలోకి టచ్‌లోకి వెళ్లారని… సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్న వైసీపీతో పోటీపడి ఇప్పుడు రాజీనామా చేస్తారా అన్నది చర్చించుకుంటున్నారు. అసలు చంద్రబాబు చెబితే వినే పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు లేరని.. రాజీనామాలు అంటేనే ఆమడ దూరం పోతారని పొలిటిలికల్ సర్కిళ్లలో తిరుగుతున్న మాట. కరోనా మహమ్మారి కాలంలో ఇప్పుడు తొందరపడి టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే.. జనాలకు బీపీ పెరిగి పొలిటికల్ మైలేజ్ పడిపోవడం పక్కా అని చెప్పుకుంటున్నారు. రాజీనామా చేసి వస్తేనే పార్టీలోకి ఆహ్వానిస్తానని జగన్ చెప్పడం వల్లే ఆలోచించుకొని ఆ మాత్రం ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారని, లేకుంటే ఇప్పటివరకు బాబుకు బాయ్ బాయ్ చెప్పి సైకిల్ దిగి ఫ్యాన్ కింద ఉండేవారని వినపడుతున్న మాట.
మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకిస్తే ఉత్తరాంధ్ర లేదా రాయలసీమకు చెందిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రజా తీర్పునకు వెళ్తే అస్సలు విషయం తెలుస్తుందని, కానీ అధికార వైసీపీని అసెంబ్లీని రద్దు చేయాలని కోరుతున్నారని ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే గుసగుసలు చెప్పుకుంటున్న మాట. మళ్లీ మీడియా ముందుకు వస్తానన్న చంద్రబాబు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల రాజీనామా విషయాన్ని ప్రస్తావించకుండా అమరావతి గురించి పూర్తిగా వివరిస్తానని చెప్పడం ఇటు వైసీపీతో పాటు ఇతర పార్టీల నేతల్లో పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. చంద్రబాబు రాజీనామాల విషయం తెచ్చినప్పుడల్లా ఆగ్రహంతో ఊగిపోతున్న టీడీపీ ఎమ్మెల్యేలు.. ఒకవేళ అందరూ రిజైన్ చేసి ఉపఎన్నికలకు వెళ్దామంటే ఆయన మాట ఏమేరకు వింటారనేది రాజకీయాల్లో ఆసక్తిరేపుతున్న అంశం. అయితే మూడు రాజధానులను సవాల్‌గా తీసుకొని ముందుకెళ్తున్న జగన్… చంద్రబాబు సవాల్‌ను స్వీకరిస్తారా లేదా అన్నది కీలకంగా మారింది.