- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డిక్కి సేవలు భేష్: ఎమ్మెల్సీ కవిత
దిశ, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా డిక్కి అందిస్తున్న సేవలు భేష్ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొనియాడారు. డిక్కి రాష్ట్ర అధ్యక్షురాలు దాసరి అరుణ, మహిళా విభాగం అధ్యక్షురాలు కృష్ణవేణి, శ్రీమా గురువారం ఎమ్మెల్సీ కవితను తన నివాసంలో కలిశారు. మార్చి 8న డిక్కి ఆధ్వర్యంలో జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలకు హజరు కావాలని ఆహ్వానించారు. అన్ని రంగాల్లో మహిళలు సత్తా చాటుతున్నారని స్వయం శక్తితో పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు దోహదపడుతున్న డిక్కీకి అభినందనలు తెలిపారు.
డిక్కీ జాతీయ అధ్యక్షులు పద్మశ్రీ నర్రా రవికుమార్ కృషితో దళిత యువ పారిశ్రామికవేత్తలు ఎదుగుతున్నారని పేర్కొన్నారు, మహిళలు స్వయం సమృద్ధితో తమకాళ్లపై తాము నిలబడాలని ఆమె పిలుపునిచ్చారు. మహిళల అభ్యున్నతికి పాటుపడు తున్న డిక్కీ అభివృద్ధికి తమ సహకారం ఉంటుందని ఆర్ధిక అభివృద్ధిలో మహిళలు ముందుండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డిక్కీ చేస్తున్న సేవలను ప్రత్యేకంగా అభినందించారు.