పెట్రోల్ ధరలు తగ్గించాలని సీపీఐ ధర్నా

by Aamani |

దిశ, ఆదిలాబాద్: పెంచిన పెట్రోల్ ధరలను కేంద్రం వెంటనే తగ్గించాలని సీపీఐ డిమాండ్ చేసింది. సోమవారం సీపీఐ జాతీయ కమిటీ పిలుపులో భాగంగా నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి విలాస్ మాట్లాడుతూ… కేంద్రం 15 రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంతో బస్సు, రైలు, ఆటో తదితర ఛార్జీలు పెరిగే అవకాశం ఉందన్నారు. కేంద్ర కార్మికుల పక్షపాతి అని చెప్పకుంటూ, కార్పొరేట్ శక్తులకు దేశాన్ని దోచిపెడుతున్నారని మండిపడ్డారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని, లేని పక్షంలో తీవ్ర ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ ధర్నాలో సీపీఐ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Advertisement

Next Story