ధర్మయ్య మృతి.. హరీశ్ రావు సంతాపం

by Shyam |   ( Updated:2020-05-23 03:35:48.0  )
ధర్మయ్య మృతి.. హరీశ్ రావు సంతాపం
X

దిశ, మెదక్: సిద్ధిపేట మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కడవేర్గు ధర్మయ్య మృతి పట్ల మంత్రి హరీశ్ రావు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. భారత్ నగర్ కౌన్సిలరుగా, విశాలాక్షి సమేత విశ్వేశ్వరాలయ దేవాలయం (భారత్ నగర్) అధ్యక్షులుగా, బట్టల వర్తక సంఘం ప్రధాన కార్యదర్శిగా, సిద్దిపేట నీలకంఠ సమాజ అధ్యక్షలుగా సమాజానికి, గౌరీ నీలకంఠేశ్వర దేవాలయానికి ధర్మయ్య విశిష్ఠమైన సేవలు అందించారని ఆయన సేవలను కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Advertisement

Next Story