- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంట్రెస్టింగ్ న్యూస్ చెబుతానంటున్న ‘ధన్య’
మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ‘7th సెన్స్’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటి ధన్య బాలకృష్ణన్. తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తున్న ధన్య.. ఇటీవలే జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన సినిమాతో పాటు ‘అనుకున్నది ఒక్కటి, అయ్యిందొక్కటి’ అనే చిత్రంలోనూ హీరోయిన్‌గా నటించింది. ఇటు హీరోయిన్‌గా, అటు ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నా తనకు ఇప్పటివరకు మంచి గుర్తింపు ఉన్న పాత్ర మాత్రం దక్కలేదు. అయితే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వార్త చెప్పబోతున్నానని తన అభిమానులకు ఇన్‌స్టా ద్వారా తెలిపింది ధన్య.
‘కొందరికీ ఇది హాట్ వార్త.. ఇంకొందరికీ కూల్.. మరికొందరికీ చాలా లైట్.. మిగతా వారికి బోల్డ్.. మీతో షేర్ చేసుకునేందుకు నా దగ్గర సూపర్ ఎక్సైటింగ్ వార్త ఒకటి ఉంది.. ఏంటో గెస్ చేయండి’ అని ధన్య బాలకృష్ణ తన ఇన్‌స్టాలో అభిమానులకు ఓ ఇంట్రెస్టింగ్ పజిల్ ఇచ్చింది. దాంతో ఆమె తన నెక్ట్స్ చేయబోయే సినిమా గురించి చెబుతుందని అంతా అనుకుంటున్నారు. ఆగస్టు 6న ధన్య పుట్టినరోజు.. కాగా అదే రోజున ఈ న్యూస్ రివీల్ చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ధన్య ఏం చెబుతుందో తెలియాలంటే వెయిట్ చేయక తప్పదు. ఈ సారైనా.. తనకు బిగ్ ప్రాజెక్ట్‌లో చాన్స్ వస్తుందో లేదో చూడాలి. ధన్య.. తెలుగు, తమిళంలో పలు వెబ్ సిరీస్‌ల్లోనూ నటించింది.