‘ఆ నలుగురు ఎమ్మెల్యేల రాజీనామాతో ఉపఎన్నిక.. అప్పుడే అభివృద్ధి’

by Sridhar Babu |
‘ఆ నలుగురు ఎమ్మెల్యేల రాజీనామాతో ఉపఎన్నిక.. అప్పుడే అభివృద్ధి’
X

దిశ, నేరేడుచర్ల: సూర్యాపేట జిల్లాలోని నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఈ ప్రాంతానికి ఉప ఎన్నికలు వస్తాయని.. తద్వారా ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ అందజేస్తారని.. బీసీ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ కన్వీనర్ ధూళిపాల ధనంజయ నాయుడు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హుజురాబాద్‌లో ఉప ఎన్నిక సందర్భంగా దళితులకు ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షలు ఇస్తానని వాగ్దానం చేశారని, అక్కడ దళితుల మీద ప్రేమ కంటే వారి ఓట్ల మీదనే ప్రేమ ఎక్కువ కనిపిస్తోందన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వారు తమ ఎన్నికల ఎత్తుగడలు ఇలాగే రూపొందించుకుంటారని, అది అత్యంత సహజం అని ‍అన్నారు. ఉప ఎన్నికల వల్ల ఆ ప్రాంత ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందుబాటులోకి వస్తాయని.. అందువల్ల సూర్యాపేట జిల్లాలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తే ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని ధనంజయ ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed