- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒమిక్రాన్ ను అడ్డుకుంటాం.. డీహెచ్ కీలక ప్రకటన
దిశ, తెలంగాణ బ్యూరో: శంషాబాద్ విమానాశ్రయంలో కొత్త కరోనాని జల్లెడ పడుతున్నామని హెల్త్ డైరెక్టర్ డా. జీ శ్రీనివాసరావు తేల్చి చెప్పారు. ఒమిక్రాన్ ని అడ్డుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ప్రజలెవ్వరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నారు. కానీ ముందస్తు జాగ్రత్తగా కొవిడ్ నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. కరోనా పరిస్థితులు, కొత్త వేరియంట్, ప్రభుత్వ సన్నద్ధతపై రెండు గంటల పాటు మంత్రి హరీష్ అధ్వర్యంలో ఆరోగ్య శ్రీ ట్రస్ట్ కార్యాలయంలో సమీక్ష జరిగింది.. అనంతరం డీహెచ్ మాట్లాడుతూ.. ఒమిక్రాన్ ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉందని, ప్రజలు కూడా జాగ్రత్తలు మరవద్దని సూచించారు. గత రెండు రోజుల నుండి పరిస్థితులు మానిటర్ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో కేసుల పెరుగుదల నిలకడగానే ఉందన్నారు.
దేశంలో కొత్త వేరియంట్ నమోదు కాలేదని స్పష్టం చేశారు. ఇప్పటికే కొత్త వేరియంట్ రాకుండా అడ్డుకునేలా ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ పెంచామన్నారు. అక్కడే ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నామని, 14 రోజుల పాటు హోమ్ క్వారెంటైన్ ఉండేలా చర్యలు తీసుకొని వారి ఆరోగ్యాన్ని మానిటర్ చేస్తున్నామన్నారు.
మూడో వేవ్ వచ్చినా మనం ఇప్పటికే అన్ని ఏర్పాట్లతో సిద్దంగా ఉన్నామన్నారు. నాలుగైదు నెలలుగా రాష్ట్రంలో కేవలం 100 నుండి 150 మధ్యనే కేసులు నమోదు అవుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో 90 శాతం మొదటి డోసు, 45 శాతం రెండో డోసు ఇచ్చామన్నారు. వ్యవధి గడిచినా రెండో డోసును 25 లక్షల మంది తీసుకోలేదన్నారు. కరోనా కేసులు తగ్గడంతో వ్యాక్సిన్ పట్ల, కరోనా నిబంధనలు పాటించడంలో కొంత నిర్లక్ష్యం ఉన్నట్లు గమనించినట్లు తెలిపారు.
ఏ వేరియంట్ అయినా ఎదుర్కొవడం మన చేతుల్లోనే ఉందని, మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని మరోసారి సూచించారు. రెండు డోసుల వ్యాక్సిన్ తప్పని సరిగా తీసుకోవాలన్నారు.