- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అల్లుడు దవాఖానా బాట.. మామ ఢిల్లీ బాట.. దళిత బంధు ఏడ?
దిశ,సిద్దిపేట: హుజూరాబాద్ ఎన్నికల తెల్లారి అందరికీ దళితబంధు ఇచ్చుడే.. పైసల్ మస్తుగున్నాయని చిలకపలుకులు పలికిన కేసీఆర్, హరీష్ రావులు ఆ సంగతి పూర్తిగా మర్చిపోయిండ్రా ఏంది.. అంటూ ఎద్దేవా చేశారు టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దేవులపల్లి యాదగిరి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళిత బంధు ఏదంటూ మంగళవారం నుంగనూరు మండల కేంద్రంలో విలేకర్ల సమావేశంలో ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో 27 లక్షల కోట్లరూపాయలున్నాయనీ, దళితుల అందిరికీ ఈ పథకాన్ని అందిస్తే.. సుమారు రెండు లక్షల కోట్ల అవుతాయనీ, దళితులందరి అభివృద్ధే తమకు ముఖ్యమని కల్లబొల్లి మాటలు మాట్లాడిన హరీష్ రావు, కేసీఆర్ ఆ ముచ్చటే పక్కన పెట్టారనీ, అల్లుడు దవాఖానా బాట, మామ ఢిల్లీ బాటపట్టి దళితులను మరోసారి మోసం చేశారంటూ ధ్వజమెత్తారు.
మెుదటి నుంచి కేసీఆర్, హరీష్ రావు అధికారమే ధ్యేయంగా పని చేస్తున్నారనీ, అందుకే ఎన్నికలొస్తే, కొత్త పథకాలు ప్రకటిస్తూ ఓట్లు దండుకొని రాజకీయ పబ్బం గడుపుతున్నారే తప్ప.. ప్రజల ఆకాంక్షించిన పాలన సాగటం లేదంటూ మండిపడ్డారు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయనందుకే.. హుజూరాబాద్ ఎన్నికల్లో ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టిన బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు. ఎంతమంది రేవంత్ రెడ్డిలు వచ్చినా, దళిత బంధు అమలు చేసి తీరుతాం.. ఈ పథకాన్ని అర్హులందరికీ అందిస్తామని సంబరపడ్డారు తెరాస మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తెలంగాణ దళిత లోకానికి ముఖం చాటేశారని దేవులపల్లి యాదగిరి అన్నారు.
రోజుకో కొత్త పథకాన్ని ప్రకటిస్తూ, పాత పథకాలను పాతరేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికైనా పనికిరాని మాటలను వదిలేసి, ప్రజలకు ఇచ్చిన దళిత బంధు, ఉద్యోగ ఖాళీల భర్తీ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, రుణమాఫీ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.