- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాహనాల పార్కింగ్‌కు కూడా వాస్తు ఉంటుందా.. కార్ ను ఎక్కడ నిలపాలి..
దిశ, ఫీచర్స్ : ఇప్పటి కాలంలో కారు, బైక్ లేని మన జీవితాన్ని మనం ఊహించలేము. ప్రతిరోజూ ఉదయం ఆఫీసుకు వెళ్లాలన్నా, పాఠశాలకు లేదా కళాశాలకు వెళుతున్నా వాహనాలు లేకుండా వెళ్లడం చాలా కష్టం. అంతే కాదు ఇంట్లో ఏదైనా వస్తువులు కావాల్సి వస్తే వెంటనే వాహనం పైన వెళ్లి వాటిని తీసుకువస్తాం. దీంతో మనం రోజువారీ పనులను తక్కువ సమయంలో, సులభంగా చేయగలుగుతున్నాం. అందుకే వాహనాలు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అయ్యాయి. అయితే వాహనాలకు వాటితో సంబంధం ఉన్న శక్తి కూడా ఉంటుందని చాలా మందికి తెలిసి ఉండదు. ఈ శక్తి వాహన యజమానుల జీవితాల పై ప్రభావం చూపుతుంది. అందుకే వాహనాలను సరైన స్థలంలో పార్క్ చేయడం చాలా ముఖ్యం. అయితే కొన్ని వాస్తునియమాలను ఉపయోగించడం ద్వారా మన జీవితాలను సురక్షితంగా ఉంచుకోవచ్చు. వాహనాల పార్కింగ్ నియమాలు వాస్తుశాస్త్రంలో చూడవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం, భవిష్యత్తులో జరిగే ప్రమాదాల నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. కార్ పార్కింగ్ కోసం వాస్తు చిట్కాలను తెలుసుకుందాం.
వాహనాల పార్కింగ్ కోసం వాస్తు చిట్కాలు..
ఇంట్లో కారు లేదా స్కూటర్‌ను పార్కింగ్ చేసే ముందు, ఈ దిశల పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముందుగా కారు లేదా స్కూటర్‌ను ఈశాన్య దిశలో పార్క్ చేయడం మానుకోండి. అయితే తూర్పు, ఉత్తర దిశలు ఓపెన్ టు స్కై కార్ పార్కింగ్‌కు ఉత్తమంగా పరిగణిస్తారు. అలాగే దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లో పెద్ద వాహనాల పార్కింగ్, కవర్ కార్ పార్కింగ్ కోసం ఉపయోగించాలి.
సెల్లార్ లో పార్కింగ్ కోసం వాస్తు చిట్కాలు..
సెల్లార్ లో కారు లేదా స్కూటర్‌ను పార్కింగ్ చేయడం గురించి కూడా ప్రజల మదిలో ప్రశ్నలు తలెత్తుంటాయి. నేలమాళిగలో వాహనాన్ని ఎలా పార్క్ చేయాలి ? వాస్తు ప్రకారం సెల్లార్ ఎలా ఉండాలి ? కారును నేలమాళిగలో లేదా గ్యారేజీలో ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచడానికి ప్రయత్నిస్తే, గ్యారేజీలోకి ప్రవేశించడం ఆగ్నేయం లేదా నైరుతి దిశ నుండి ఉండకూడదని కూడా గుర్తుంచుకోండి. సెల్లార్ లో తగినంత వెంటిలేషన్, పగటి వెలుతురు ఉండేలా ప్రయత్నించండి. ఎందుకంటే వాస్తు ప్రకారం ప్రకృతి ఎల్లప్పుడూ మన పరిసరాలలో ఉండాలి. తూర్పు లేదా ఉత్తరం వైపు గ్యారేజ్ ఫ్లోర్ వాల్ ఉంచేలా చూడండి. కారు తాళాలను, మాన్యువల్‌ను వాయువ్య దిశలో ఉంచండి.
వరండాలో పార్కింగ్ కోసం వాస్తు చిట్కాలు..
మీరు పార్కింగ్ కోసం సెల్లార్ ని నిర్మించలేకపోతే, మీరు ఉత్తరం లేదా ఈశాన్య దిశలో షెడ్ ని నిర్మించవచ్చు. దీని కోసం మీరు అంతరాయం లేని శక్తి ప్రవాహం కోసం పార్కింగ్ చుట్టూ కనీసం 2-3 అడుగుల స్థలం ఉండేలా చూసుకోవాలి. మీరు మీ కారును ఎండ, వర్షం నుండి రక్షించడానికి ఫైబర్ లేదా మెటల్ షేడ్‌ని తయారు చేసేలా ప్లాన్ చేస్తుంటే, వాస్తు ప్రకారం ఫైబర్ షీట్ రంగును ఎంచుకోండి. మీ వరండా మీ ఇంటికి తూర్పు నుండి దక్షిణ ప్రాంతంలో ఉంటే, మీరు అక్కడ మొక్కను నాటవచ్చు. ఇది అదృష్టంగా పరిగణిస్తారు. ఆర్థిక లాభాలకు సహాయపడుతుంది.
గమనిక : ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకున్నది. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.