- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ రంగుల దుస్తులు ధరిస్తే నిజంగా అదృష్టం కలిసి వస్తుందా..?
దిశ, ఫీచర్స్ : మన జీవితంలో జ్యోతిష్యానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే జ్యోతిష్యం సహాయంతో మన జీవితంలో జరుగుతున్న అన్ని సమస్యల నుండి బయట పడవచ్చు. జ్యోతిష్యం నివారణలను అవలంబించడం ద్వారా, మన జీవితంలో కుటుంబ సంబంధాలను మరింత సంతోషంగా ఉంచుకోవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జీవితంలోని ప్రతి పనిలో విజయం సాధించాలంటే ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరించాలో కూడా చెప్పారు. దీని గురించి వివరంగా తెలుసుకుందాం.
జ్యోతిష్యం ప్రకారం ఏ రోజు ఏ రంగు బట్టలు ధరించాలి..
సోమవారం
సోమవారం శివుడు, చంద్రుని రోజుగా పరిగణిస్తారు. అందుకే ఈ రోజున తెలుపు, వెండి రంగుల దుస్తులను ధరించడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ రోజున తెల్లటి రంగు దుస్తులు ధరించడం వల్ల జీవితంలో ప్రశాంతత చేకూరుతుందని పండితులు చెబుతున్నారు.
మంగళవారం
మంగళవారం హనుమంతుడికి అంకితం చేసిన రోజు. ఈ రోజున బజరంగబలి ఆశీర్వాదం పొందడానికి నారింజ రంగు దుస్తులు ధరించాలని చెబుతున్నారు పండితులు. దీని వల్ల ప్రతి సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందట.
బుధవారం
బుధవారం గణేశుడికి అంకితం చేసిన రోజు. ఈ రోజు పూజలో గణేశుడికి ఆకుపచ్చ గడ్డిని సమర్పిస్తారు. అందుకే ఈ రోజున ఆకుపచ్చ బట్టలు ధరించడం శుభప్రదంగా పరిగణిస్తారు.
గురువారం
గురువారం విష్ణువు, బృహస్పతి రోజుగా పరిగణిస్తారు. పసుపు రంగు విష్ణువు, గురువు బృహస్పతికి ఇష్టమైన రంగుగా పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజు పసుపు రంగు దుస్తులు ధరించడం శ్రేయస్కరం అంటున్నారు.
శుక్రవారం
శుక్రవారాన్ని లక్ష్మీ దేవి, శుక్ర దేవుడికి అంకితం చేసిన రోజు. పూజలో లక్ష్మీదేవికి ఎర్రటి కుంకుమ, ఎరుపు రంగు వస్త్రాలు సమర్పిస్తారు. అందుకే ఈ రోజు ఎరుపు రంగు దుస్తులను ధరించడం మంచిదని భావిస్తారు. ఈ రోజున ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.
శనివారం
శనివారం శని దేవుడికి అంకితం చేసిన రోజు. శని దేవుడిని సంతోషంగా ఉంచడం ద్వారా వ్యక్తుల జీవితంలో అన్ని కష్టాలు తొలగిపోతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దేవుడి అనుగ్రహం పొందడానికి ఈ రోజున నలుపు, నీలం వంటి ముదురు రంగు దుస్తులు ధరించడం శుభప్రదంగా పరిగణిస్తారు.
ఆదివారం
ఆదివారం సూర్య భగవానుడికి అంకితం చేసిన రోజు. సూర్యభగవానుడి మహిమలాగే, ఈ రోజున బంగారు, గులాబీ లేదా ఎరుపు రంగు దుస్తులు ధరించడం వలన గౌరవం పెరుగుతుంది. ప్రతి పనిలో విజయం సాధిస్తారు.
గమనిక : ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకున్నది. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.