- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రేపే తిరుపతి పుట్టిన రోజు.. ఈ నగరం ఏర్పడి ఎన్ని వందల ఏళ్లో తెలుసా..?
దిశ, వెబ్ డెస్క్: హిందువుల పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఆలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఇక్కడ కు నిత్యం ఎంతో మంది భక్తులు వెళ్లి స్వామి వారిని పూజించుకుంటారు. అయితే ఈ ఆలయం ఏర్పడటానికి ఓ చరిత్ర ఉందట. ఈ గుడి ఎలా ఏర్పడింది, ఎప్పుడు ఏర్పడిందో ఇక్కడ తెలుసుకుందాం.
తిరుపతి నగరం క్రీ.శ 1130 లో ఫిబ్రవరి 24న ఆవిర్భవించినట్లు చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. గతేడాది తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఫిబ్రవరి 20 పురాతన శాసనాలను తెప్పించారు. అందులో ఈ నగరానికి 1130 ఫిబ్రవరి 24న శంకుస్థాపన చేసినట్లు ఆదారాలు బయటపడ్డాయి. దీంతో ప్రతి యేటా తిరుపతికి పుట్టిన రోజు వేడుకలు జరుపుతున్నారు.
ఈ సంవత్సరంలో తిరుపతి నగరం ప్రజలు 893 వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకోనున్నారు. ఆ కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు చేశారు. సౌమ్య నామ సంవత్సరం ఉత్తరా నక్షత్ర సోమవారం ఫాల్గుణ పౌర్ణమి నాడు రామానుజులు గోవింద రాజులన పీఠాధిపతిని ప్రతిష్టించి తిరుపతిని నిర్మించడం మొదలుపెట్టారట. మొదట దీనిని గోవిందరాజు పట్టణం అని, తర్వాత ఇది చాలా కాలం పాటు రామానుజ పురంగా పిలిచారు. 13వ శతాబ్దం నుండి తిరుపతి గా పిలుస్తున్నారు.