Maha Shivratri : మహా శివరాత్రి రోజు పాటించాలిసిన నియమాలివే !

by Prasanna |   ( Updated:2023-02-09 05:39:11.0  )
Maha Shivratri : మహా శివరాత్రి రోజు పాటించాలిసిన నియమాలివే !
X

దిశ, వెబ్ డెస్క్ : హిందువులు జరుపునే పండుగలలో మహా శివరాత్రి ఒకటి. మహా శివ రాత్రి రోజు శివ పార్వతుల వివాహం జరిగింది. ప్రతి నెలలో వచ్చే శివ రాత్రిని మాస శివ రాత్రి అని పిలిచుకుంటాం. కానీ శీతాకాలం చివర్లో .. వేసవి కాలం ముందు వచ్చేటటువంటి ఫాల్గుణ మాస చతుర్దశి నాడు మహా శివ రాత్రిని జరుపుకుంటారు. అయితే 2023 ఫిబ్రవరి 18 వ తేదీన మహా శివ రాత్రిని జరుపుకుంటారు. ఫాల్గుణ మాసంలోని చతుర్దశి తిధి అంటే ఫిబ్రవరి 17 వ తేదీ రాత్రి 08 గంటల రెండు నిముషాల ఈ తిధి అనేది ప్రారంభమవుతుందట. ఫిబ్రవరి 18 వ తేదీ సాయంత్రం 4 గంటల 18 నిముషాల వరకు ఉంటుందట.

మహా శివ రాత్రి రోజు తెల్లవారు జామున లేచి స్నానం చేసి ఉపవాసం పాటిస్తూ శివ లింగానికి పంచామృతంతో అభిషేకం చేయండి అభిషేకం తరవాత ఓం నమః శివాయ అంటూ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ విధంగా రోజంతా శివారాధనలో ఉండండి. రాత్రి అంతా జాగారం చేసి మరు నాడు భోజనం చేసి ఉపవాస దీక్షను విరమించండి. ఈ మహా శివ రాత్రి రోజున మహా మృత్యుంజయం మంత్రం పఠిస్తే మీకు రెట్టింపు శుభ ఫలితాలు వస్తాయట.

Advertisement

Next Story

Most Viewed