- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ శివాలయంలోని చింతచెట్టు రహస్యం తెలిస్తే షాకవుతారు..
దిశ, ఫీచర్స్ : ఆలయం అన్నాక చెట్లు ఉండటం సహజం. ప్రతి ఆలయానికి ఒక స్థల వృక్షం ఉంటుంది. అలానే తమిళనాడులోని పట్టీశ్వరం దేవాలయంలో కూడా రెండు ప్రత్యేకమైన చెట్లు ఉన్నాయి. అందులో ఒకటి చింతచెట్టుకాగా, రెండోది తాటిచెట్టు. ఈ రెండు చెట్ల వెనుక ఓ రహస్యం దాగుంది. చెట్ల నుంచి వచ్చే గింజలు నాటితే మొలకెత్తి మొక్కలు వస్తాయి. కానీ, ఈ పట్టీశ్వరంలోని చింతగింజలను నాటితే... ఏం జరుగుతుందో తెలుసా... తాటి చెట్టు వెనుక దాగున్న తాటికాయంత రహస్యమేంటో తెలుసా? పట్టీశ్వరం ఆలయమే ఓ పెద్ద రహస్యంగా ఎందుకు చెబుతారు... తెలుసుకుందాం రండి...
ఏదైనా మనకు తెలియకుంటే దాన్ని శివోహం అంటాం. శివుడి క్షేత్రాల్లోని రహస్యాలు కూడా అలానే ఉంటాయి. తమిళనాడులోని పట్టీశ్వరం ఆలయం ఓ రహస్యాల పుట్ట. ఇక్కడ ఆకట్టుకునే చిత్రాలు, విచిత్రాలు ఎన్నో ఉన్నా... అందరి దృష్టి ఆ రెండు చెట్లమీదనే ఉంటుంది. పట్టీశ్వరం వచ్చిన భక్తులెవరైనా సరే ఆ రెండు చెట్ల గురించే మాట్లాడుకుంటారు. చెబుతున్నా మాటలు, ఆ మాటల వెనుకనున్న ఆంతర్యం నిజమా కాదా అని తెలుసుకునేందుకు భక్తులు ప్రయత్నిస్తుంటారు. ఆ మాటలు నిజమేనని తెలిసిన భక్తులు పట్టీశ్వరుడికి కట్టుబడి ఉంటారు.
అంతా శివోహం... శివుడు అంటేనే రహస్యం. ఆయన గురించి ఎంత తెలుసుకున్నా... ఇంకా తెలుసుకోవలసింది ఎంతో ఉంటుంది. ఆయన కొలువైన క్షేత్రాల్లో రహస్యాలు కోకొల్లలు. అందులో ఒక క్షేత్రం పట్టీశ్వర ఆలయం. ఈ ఆలయాన్ని రెండొవ శతాబ్దంలో కరికాల చోళుడు నిర్మించినట్టు చరిత్ర చెబుతున్నది. అలఘాత్రి నాయక్ అనే రాజు 17వ శతాబ్దంలో కనక సభను ఈ ఆలయంలో ఏర్పాటు చేశాడు. మహాదేవుడు వివిధ రకాల క్రీడలను ప్రదర్శించిన ప్రదేశంగా పట్టీశ్వర్ ఆలయాన్ని చెబుతారు. ఇక్కడ శివుడు స్వయంభు లింగంగా వెలిశాడని భక్తులు చెబుతారు. ఆ
తమిళనాడు రాష్ట్రం అనేక పురాతన ఆలయాలకు ప్రసిద్ధి.. అందుకే ఈ రాష్ట్రాన్ని దేవాలయాల భూమిగా కూడా పిలుస్తారు. వైష్ణవం, శైవ క్షేత్రాలు మాత్రమే కాదు సుబ్రమణ్య స్వామి, అమ్మవార్ల ఆలయాలకు కూడా ప్రపంచ వ్యాప్తంగా పేరు గాంచాయి. లాంటి ప్రసిద్ధి ఆలయాల్లో ఒకటి కోయంబత్తూరు పెరూర్‌లోని పట్టీశ్వరం ఆలయం. ఈ ఆలయాన్ని రెండవ శతాబ్దంలో కరికాల చోళుడు నిర్మించాడు. ఈ ఆలయ కనక సభను 17వ శతాబ్దంలో అలఘాత్రి నాయక్ నిర్మించారు. ఈ దేవాలయం శివుడు వివిధ క్రీడలను ప్రదర్శించిన ప్రదేశం. ఆలయ నిర్మాణం వివిధ కళాత్మక పద్ధతులతో వివరించబడింది. రాష్ట్రంలోని పురాతన ఆలయంలో ఒకటిగా నిలిచింది. పట్టీశ్వర అని పిలువబడే శివుడు..పచ్చనాయకి గా పార్వతి దేవి పూజలను అందుకుంటున్నారు. ఇక్కడ శివయ్య స్వయంబు లింగం అని భక్తుల విశ్వాసం
ఆలయం గొప్పతనం:
భగవాన్ పట్టీశ్వరుని తలపై దివ్యమైన ఆవు కామధేనుడి పాదముద్ర ఇప్పటికీ కనిపిస్తుంది. గర్భగుడిలోని విమానంలో ఎనిమిది దిక్కుల అధిపతులు బొమ్మలు దర్శనమిస్తాయి. తల్లి పచ్చ నాయకి విమానం గోపురం చతురస్రాకారంలో ఉంటుంది. అంబికా మాత మనోన్మణి కోసం ఒక మందిరం ఉంది. మురుగన్ తల్లి దండ్రుల ఆలయాల మధ్య ఉంటాడు. ఇది మోక్ష కేంద్రం కనుక భైరవుడు తన కుక్క వాహనం లేకుండా జ్ఞాన భైరవుడిగా దర్శనమిస్తాడు.
తల్లి పచ్చినాయకి మందిరం వెలుపల వరదరాజ పెరుమాళ్ విగ్రహం ఉంది. ఆలయంలోని శ్రీ ఆంజనేయుడు చెక్కతో నిర్మించబడ్డాడు. గోరఖ్ నాథ్ వంశ వ్యవస్థాపకుడు తమిళ సిద్ధ యోగి గోరఖర్ ఈ ఆలయంలో తపస్సు చేసి పవిత్రమైన చెట్లతో ధ్యాన స్థలాన్ని సృష్టించారని స్థానికుల కథనం. ప్రసిద్ధ కనక సభ రాతి శిల్పల ప్రత్యేకతను తెలియజేస్తుంది. ఇలాంటి శిల్పాలు మరెక్కడా కనిపించవు.
ఆలయం ముందు చింత చెట్టు..
ఆలయానికి సంబంధించిన పవిత్ర వృక్షాలు తాటి చెట్టు, చింత చెట్టు . ఈ చెట్లను ఇరవ పనై, పిరవ పులి అని పిలుస్తారు. ఆలయం ముందు చింత చెట్టు విత్తనాలు మరెక్కడైనా నాటితే మొలకెత్తవు. అదే విధంగా తాటి చెట్టు ఎప్పటికీ పడిపోదుట.అంటే పట్టీశ్వరని భక్తితో పూజించిన వారు ఎప్పుడూ పేరు, ప్రతిష్టలతో చరిత్రలో నిలుస్తారట. పట్టీశ్వరుడిని ప్రార్థించిన వారు సంపూర్ణ మోక్షాన్ని పొందుతారని.. జనన మరణాల చక్రం నుండి విముక్తి పొందుతారని నమ్ముతారు.
నోయాల్ నదిలో ఎముకలు
చనిపోయిన వారి ఎముకలు, ఆలయం సమీపంలో ప్రవహించే నోయాల్ నదిలో ఉంచినప్పుడు 144 రోజుల్లో తెల్ల రాళ్ళుగా మారుతాయి
దేవాలయం పక్కనే ప్రవహించే నొయ్యల్ నదిలో చనిపోయిన వారి ఎముకలు ఉంచితే.. 144 రోజుల్లో తెల్ల రాళ్ళుగా మారుతాయని చెబుతారు. చనిపోయిన వారి చెవిలో భగవంతుడు ఐదు అక్షరాలతో కూడిన నమః శివాయ మంత్రాన్ని ఉచ్చరించి.. వారిని తనతో తీసుకువెళతాడని నమ్ముతారు. ఈ ప్రాంతంలో ఆవు పేడలో కూడా పురుగులు ఉండవు.
ఆలయం తెరిచే సమయం
ఈ దేవాలయం రోజూ ఉంటుంది.. ఉదయం : 05:30 నుండి 01:00 వరకు.. సాయంత్రం : 04:00 నుండి 09:00 వరకు తెరిచి ఉంటుంది.
ఆలయానికి ఎలా చేరుకోవాలంటే
విమానంలో – కోయంబత్తూరు విమానాశ్రయానికి చేరుకుని పెరూర్ పట్టీశ్వర స్వామి ఆలయానికి వెళ్లవచ్చు.
రైల్వే ద్వారా – పేరూర్ పట్టీశ్వర స్వామి దేవాలయం సమీపంలో ఉన్న కోయంబత్తూరు జంక్షన్ రైల్వే స్టేషన్ లో దిగాల్సి ఉంటుంది
రోడ్డు మార్గం – కోయంబత్తూర్ నగరం దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉంది. కోయంబత్తూరు బస్ స్టేషన్ చేరుకుంటే గుడికి వెళ్లేందుకు బస్సు సౌకర్యం ఉంది.