రాంలాలా కోసం అయోధ్యకు ప్రత్యేకమైన బహుమతులు.. అవి ఏంటో తెలుసా

by Sumithra |   ( Updated:2024-01-12 09:22:08.0  )
రాంలాలా కోసం అయోధ్యకు ప్రత్యేకమైన బహుమతులు.. అవి ఏంటో తెలుసా
X

దిశ, ఫీచర్స్ : అయోధ్యలోని రామాలయంలో రామ్‌లాలాకు ఘనస్వాగతం పలికేందుకు ప్రపంచం నలుమూలల నుంచి రామభక్తులు సిద్ధమయ్యారు. ఎందుకంటే జనవరి 22న రాంలాలా గుడిలో ఆసీన్నులు కాబోతున్నారు. దేశం నలుమూలల నుండి ప్రజలు కూడా తమ భక్తికి తగ్గట్టుగా రాంలాలా కోసం అయోధ్యకు కానుకలు పంపుతున్నారు.

రామమందిరం : రాంలాలాకు స్వాగతం పలికేందుకు దేశం నలుమూలల నుంచి రామభక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. ఎందుకంటే ప్రతిఒక్కరూ ఈ అద్భుతమైన సుందర దృష్యాన్ని చూడాలని కోరుకుంటారు. అందుకే రామభక్తులు ఆలయానికి, రాంలాలకు ప్రత్యేక కానుకలతో అయోధ్యకు చేరుకుంటున్నారు. రామ్ మందిర్ ట్రస్ట్ అందుకున్న ప్రత్యేక బహుమతులలో రామ్ లల్లా కోసం 108 అడుగుల పొడవైన అగరబత్తి, భారీ దీపం, 10 అడుగుల తాళం, యుపీలోని ఎటాహ్ నుండి భారీ గంట ఉన్నాయి.

ఎటాహ్ గంట..

ప్రపంచం నలుమూలల నుంచి రాంలాలాకు బహుమతులను పంపిస్తున్నారు భక్తులు. ఈ క్రమంలోనే యుపీలోని ఎటాహ్‌లోని జలేసర్ నివాసితుల తరపున 2400 కిలోల గంటలను రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అందజేశారు. ఈ గంట శబ్దం పదికిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని తెలిపారు. దీంతో పాటు మరో ఏడుగంటలను కూడా అందజేశారు.

రామ భక్తులు దేశవ్యాప్తంగా మాత్రమ కాకుండా విదేశాల్లో కూడా ఉన్నారు. వీరు కూడా రాంలాలా కోసం ప్రత్యేక కానుకలు పంపుతున్నారు. శ్రీలంక నుంచి కూడా ఒక ప్రతినిధి బృందం అయోధ్యకు వచ్చింది. వీరు అశోక వాటిక నుండి తెచ్చిన బండను రాంలాలాకు బహుమతిగా ఇచ్చాడు.

సీతమ్మ తల్లి జన్మస్థలం బహుమతులు..

తల్లి సీత జన్మస్థలం నుండి కూడా అయోధ్యకు బహుమతులు వస్తున్నాయి. సీతామాత జన్మస్థలమైన నేపాల్‌లోని జనక్‌పూర్ నుండి రాముని కోసం నగలు, బట్టలు, వెండి చెప్పులు వచ్చాయి.

Advertisement

Next Story

Most Viewed