- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Astrology: 100 ఏళ్ల తర్వాత శక్తివంతమైన యోగం .. ఆ రాశుల వారికి ఊహించని ధన లాభాలు..!

దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, గ్రహాలు రాశి సంచారాలు చేస్తుంటాయి. కొన్ని ముఖ్యమైన గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తాయి. ఆ సమయంలో రెండు నుంచి మూడు ఒకే రాశిలో కలిసినప్పుడు శక్తివంతమైన యోగాలు ఏర్పడుతుంటాయి. త్వరలోనే పంచగ్రహి, సప్త గ్రహీయోగాలు ఏర్పడనున్నాయి. వందేళ్ల తర్వాత ఈ యోగాలను చూడబోతున్నాం. ఈ నెల 29న శని గ్రహం, మీనరాశిలోకి సంచరించడం వలన సప్తగ్రహ యోగం ఏర్పడబోతోంది. దీని ప్రభావం 12 రాశుల మీద చూపనుంది. అయితే, రెండు రాశుల వారికీ శుభంగా ఉంటుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..
మిథున రాశి ( Mithuna rashi )
నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. యువతకు జాబ్స్ ఆఫర్స్ లభిస్తాయి. కెరీర్ పరంగా వస్తున్న సమస్యలు నుంచి బయటపడతారు. కోర్టు సమస్యలు పరిష్కరించబడతాయి. వ్యాపారవేత్తలకు అధిక లాభాలు వస్తాయి. దీని కారణంగా కుటుంబంలో సంతోష వాతావరణం నెలకొంటుంది.
కన్యా రాశి ( Kanya rashi )
సప్తగ్రహి రాజయోగం ఏర్పడడం వలన కన్యా రాశి వారికి అనేక లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా, ఈ సమయంలో ఈ రాశి వారు మొదలు పెట్టిన పనులు అన్ని పూర్తి చేస్తారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది. కొత్తగా వ్యాపారాలు చేసేవారికి ఊహించని ధన లాభాలు వస్తాయి. అలాగే, మీ వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు తొలగిపోతాయి.
కర్కాటక రాశి ( Karkataka rashi )
ఈ శక్తివంతమైన యోగం వలన కర్కాటక రాశి వారికి కూడా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. జ్యోతిష్యు నిపుణులు చెబుతున్నారు. మీ స్నేహితులతో వ్యాపారాలు మొదలు పెడతారు. మీ పాత భూములకు రేట్లు పెరుగుతాయి. పెట్టుబడులు పెట్టిన వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.