మార్చి 17న చంద్ర - శుక్ర గ్రహాల సంయోగం.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!

by Prasanna |   ( Updated:2025-03-13 03:07:42.0  )
మార్చి 17న చంద్ర - శుక్ర గ్రహాల సంయోగం.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ ఏడాది హోలీ పండగ ( Holi Festival ) ను మార్చి 14 న జరుపుకోనున్నారు. ఈ ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది భారతదేశ వ్యాప్తంగా, ఈ పండుగను చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అంతేకాదు, హోలీకి ప్రత్యేకమైన ప్రాముఖ్యత జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే, మార్చి 17వ తేదీన చంద్రుడు, తులా రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఇప్పటికే.. అదే రాశిలో శుక్రుడు ఉండడం వలన ఈ రెండు గ్రహాలు కలవనున్నాయి. దీని ప్రభావం 12 రాశుల వారి పైన పడనుంది. దానిలో రెండు రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు తీసుకురానుంది.

కర్కాటక రాశి ( Karkataka rasi )

తులా రాశిలో శుక్రుడు, చంద్రుడి కలవడం వలన వల్ల కర్కాటక రాశి వారికి మంచిగా ఉంటుంది. ఈ సమయంలో సంతోషంతో పాటు శ్రేయస్సు కలుగుతుంది. ముఖ్యంగా, విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కల నేరుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టె వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. పాత భూములకు రేట్లు పెరగడంతో కుటుంబంలో సంతోష వాతావరణం నెలకొంటుంది. మీరు పనిచేసే ఆఫీసులో ప్రమోషన్ తో పాటు జీతం కూడా పెరుగుతుంది.

మిథున రాశి ( Mithuna rasi )

మిథున రాశి వారికి ఈ సంయోగం ఏర్పడడం వలన పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. మీరు ఏదైనా కొత్త పని మొదలు పెట్టేటప్పుడు మీ కుటుంబ సభ్యులకు చెప్పి చేయండి. ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి. మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. ప్రభుత్వ రంగాల్లో పని చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. వివాహం కానీ వారికీ, పెళ్లి పిక్స్ అయ్యే అవకాశం ఉంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Read More..

Todays Horoscope: ఈ రోజు రాశి ఫలాలు ( 13-03-2025)

Today Panchangam: నేటి పంచాంగం (13-03-2025) ఈ రోజు శుభ, అశుభ గడియలు ఇవే.. !

Next Story

Most Viewed